NTV Telugu Site icon

Rajamouli: రామోజీరావు పార్థివదేహం వద్ద రాజమౌళి కంటతడి.. భారత రత్న ఇవ్వాలంటూ!

Rajamouli Ramoji Rao

Rajamouli Ramoji Rao

Rajamouli cries after seeing Ramoji Rao Dead Body: టాలీవుడ్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి కంటతడి పెట్టుకున్నారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం సిటీ లోని ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ నేపద్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి కూడా తన కుటుంబ సభ్యులందరితో కలిసి వెళ్లి తుది శ్వాస విడిచిన రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం రాజమౌళి కంటతడి పెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాజమౌళి రామోజీరావు తో చాలా సన్నిహితంగా మెలిగే వారిని చెబుతూ ఉంటారు.

Ramoji Rao: మోడీ ప్రమాణ స్వీకారం ఉన్నా ఢిల్లీ నుంచి హుటాహుటిన బయలుదేరిన పవన్

రాజమౌళి సినిమా దర్శకుడు అయ్యే కంటే ముందే శాంతి నివాసం అనే సీరియల్ తో దర్శకుడిగా మారారు. ఈ శాంతి నివాసం సీరియల్ ఈటీవీ లోనే ప్రసారమయ్యేది. అలా అప్పుడు రామోజీరావు తో రాజమౌళికి ఏర్పడిన పరిచయం తర్వాత సాన్నిహిత్యంగా మారింది. ఇక రామోజీరావు మృతి నేపథ్యంలో రాజమౌళి సోషల్ మీడియా వేదికగా కూడా తన నివాళులర్పించారు. ఒక వ్యక్తి తన 50 సంవత్సరాల స్థితిస్థాపకత, కృషి మరియు ఆవిష్కరణలతో లక్షలాది మందికి ఉపాధి, జీవనోపాధి మరియు ఆశలను అందించారు. రామోజీ రావు గారికి మనం నివాళులు అర్పించే ఏకైక మార్గం “భారతరత్న” ప్రదానం చేయడం ద్వారా అంటూ ఆయన పేర్కొన్నారు.

Show comments