Site icon NTV Telugu

VR: కిచ్చా సుదీప్ కు రాజమౌళి శుభాభినందనలు!

Kicha Sudeep

Kicha Sudeep

Rajamouli congratulates Kiccha Sudeep!

సుదీప్ నటించిన కొన్ని కన్నడ చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి విడుదలైనా… అతను తెలుగువారికి బాగా చేరువైంది ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాతోనే. ఆ మూవీలో సుదీప్ నటనను అత్యద్భుతంగా కాప్చర్ చేశారు రాజమౌళి. అప్పటి నుండి వారిద్దరి మధ్య అనుబంధం అలా కొనసాగుతూనే ఉంది. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బాహుబలి’లోనూ సుదీప్ ఓ కీలక పాత్రను పోషించాడు. పాన్ ఇండియా మూవీస్ కు రాచబాట వేసిన రాజమౌళి పథంలోనే ఇప్పుడు కన్నడ చిత్రసీమ కూడా సాగుతోంది. అలా వచ్చిందే ‘కేజీఎఫ్’ చిత్రం కూడా. సుదీప్ సైతం తన లేటెస్ట్ త్రీ డీ మూవీ ‘విక్రాంత్ రోణ’ను ఐదు భారతీయ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. రేపు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ భారీ స్థాయిలో జనం ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా కిచ్చా సుదీప్ కు రాజమౌళి శుభాభినందనలు తెలియచేశాడు. ‘సుదీప్ ఎప్పుడూ ప్రయోగాలు చేయడానికి, సవాళ్ళను స్వీకరించడానికి ముందు ఉంటాడు. ‘విక్రాంత్ రోణ’గా అతని నటన చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రం కథానాయకుడు సుదీప్ కూ, యూనిట్ సభ్యులకు నా శుభాకాంక్షలు” అని అన్నారు. భారీ బడ్జెట్ తో ‘విక్రాంత్ రోణ’ చిత్రాన్ని జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్ నిర్మించారు.

 

Exit mobile version