దర్శ ధీరుడు రాజమౌళి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అణిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు గెస్టుగా వచ్చాడు రాజమౌళి. మహేష్ అండ్ రాజమౌళి ఒకే స్టేజ్ పైన చూడాలి అంటే SSMB 29 అనౌన్స్మెంట్ బయటకి వచ్చే వరకూ వెయిట్ చేయాలేమో అనుకున్నారు కానీ అనిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ మహేష్ అండ్ రాజమౌళి పక్క పక్కన నిలబెట్టింది. స్టేజ్ పైన రాజమౌళ మాట్లాడుతూ తడబడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. తను అనుకున్నది క్లియర్ గా చెప్పే రాజమౌళి… ఈ మధ్య సినిమా వేదికలపై పెద్దగా కనిపించట్లేదుగా సడన్ గా అంతమంది జనం కనిపించే సరికి మాట్లాడే అప్పుడు కాస్త తడబడినట్లు ఉన్నాడు.
“డిసెంబర్ 1న అనిమల్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఒక టీజర్ చూడగానే సినిమా చూడాలి అనిపించేలా చేసింది అనిమల్ మూవీ మాత్రమే. అయితే ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ అవుతుంది, నేను ఒకటి-రెండు ట్రావెలింగ్ లో ఉంటాను. అందుకే అనిమల్ సినిమాని మీ అందరి కన్నా ముందే డిసెంబర్ 31నే చూస్తున్నాను. మీరు కూడా సినిమా చూడండి” అని రాజమౌళి స్పీచ్ ముగించేశాడు. ఇక్కడ రాజమౌళి చెప్పాలి అనుకున్నది నవంబర్ 30న అయ్యి ఉండొచ్చు. డిసెంబర్ 1న అనిమల్ రిలీజ్ అవుతుంది కాబట్టి అంత కన్నా ముందు రోజు అంటే నవంబర్ 30న రాజమౌళి స్పెషల్ షో చూడనున్నాడు. మరి అనిమల్ సినిమాని చూడగానే రాజమౌళి సోషల్ మీడియాలో ఎలాంటి రివ్యూ ఇస్తాడు అనేది చూడాలి. ఒకవేళ రాజమౌళికి నచ్చి అనిమల్ గురించి ఒక్క పాజిటివ్ ట్వీట్ పడితే చాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురవడం ఖాయం.
