ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని గ్రాండ్ గా వరల్డ్ ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేసిన రాజమౌళి… నెక్స్ట్ మహేష్ బాబు సినిమాతో వరల్డ్ సినిమాని కెలికేయడానికి రెడీ అవుతున్నాడు. ఇండియన్ జోన్స్ స్టైల్ లో అడ్వెంచర్ సినిమా చేయబోతున్న రాజమౌళి… వరల్డ్ ఫిల్మ్స్ స్టాండర్డ్ ని మీట్ అవ్వడానికి ప్రణాళిక రచిస్తున్నాడు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ని సెట్ చేస్తున్న రాజమౌళి… ఈసారి ఒకటి కాదు అంతకు మించి ఆస్కార్స్ ని ఇండియాకి తీసుకోని వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆఫ్రికన్ అడవుల్లో అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం రాజమౌళి ప్రీ విజ్ వర్క్స్ ని స్టార్ట్ చేసాడని సమాచారం. ఇండియాలోనే అత్యధికంగా వెయ్యి కోట్ల బడ్జట్ తో ఈ సినిమా రూపొందుతుందని సమాచారం.
వెయ్యి కోట్ల బడ్జట్ అంటే కలెక్షన్ల లెక్క రెండు వేల కోట్ల నుంచి స్టార్ట్ అవ్వడం గ్యారెంటీ. ఇదిలా ఉంటే SSMB 29 సినిమా కోసం రాజమౌళి… ఇండోనేషియన్ హీరోయిన్ చెల్సియా ఇస్లాన్ ని దింపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా వినిపిస్తున్న ఈ వార్త నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విపరీతంగా స్ప్రెడ్ అయిన ఈ న్యూస్ దాదాపుగా అఫీషియల్ అయ్యేలాగే ఉంది. ఒకవేళ మెయిన్ హీరోయిన్ గా కాకపోయినా ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం చెల్సియా ఇస్లాన్ ని రాజమౌళి కాస్ట్-ఇన్ చేసే అవకాశం ఉంది. ఈ హీరోయిన్ చెల్సియా ఇస్లాన్ ఇన్స్టాగ్రామ్ లో రాజమౌళిని ఫాలో అవుతుండడమే… రూమర్ కాదు నిజమే అనే ఫీలింగ్ కి కారణం అయ్యింది. చెల్సియా ఇస్లాన్… రాజమౌళిని ఫాలో అవుతుండడంతో మహేష్ బాబు హీరోయిన్ ఫిక్స్ అని… చెల్సియా ఇస్లాన్ ని ఫాలో చేయడం, ఆమె ఫోటోలని వైరల్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఇంకొన్ని రోజులు పోతే మహేష్ బాబు ఫోటోస్ తో చెల్సియా ఇస్లాన్ ఫోటోస్ ని ఎడిట్ చేసి ఫ్యాన్స్ పోస్టర్స్ ని డిజైన్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు.