హైదరాబాద్ యూసఫ్ గూడా లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి నలుగురు ప్రముఖ దర్శకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు దర్శక ధీరుడు రాజమౌళి, కొరటాల శివ, వెంకీ కుడుముల, బుచ్చిబాబు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ ‘పుష్ప’ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత మంచి ప్రొడక్ట్ ను చేతిలో పెట్టుకుని వదలొద్దు. ప్రమోషన్స్ బాగా చేయాలి అంటూ పలు సూచనలు ఇచ్చారు.
“ఆర్ఆర్ఆర్” సినిమా పనులపై తరచూ ముంబై వెళుతున్నప్పుడు గమనించాను. బాలీవుడ్ ప్రేక్షకులు ‘ఆర్ఆర్ఆర్’ కంటే కూడా ‘పుష్ప’ గురించే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని రాజమౌళి వెల్లడించారు. ఈ పుష్పాలు సినిమా చాలా మంచి సబ్జెక్ట్ అని ప్రమోషన్స్ ఇంకా గట్టిగా చేయాలి అని అల్లు అర్జున్ కి రాజమౌళి సూచించారు. నీ చేతిలో ఇంత మంచి ప్రోడక్ట్ ఉంది దీనిని అలా ఊరికే వదిలేయకూడదు. ఎంత దూరం ప్రమోట్ చేయగలిగితే అంత దూరం ప్రమోట్ చేయాలి. ‘పుష్ప’ టీచర్ వచ్చినప్పుడు కళ్ళు చెదిరిపోయాయి. సినిమాటోగ్రాఫర్ పేరు నోరు తిరగటం లేదు కానీ ఆయన మాత్రం అద్భుతంగా సినిమాటోగ్రఫీ అందించారు. ఫైట్స్ విషయంలో రామ్, లక్ష్మణ్ మాస్టర్ లు, మా సొంత మనిషిగా భావించే పీటర్ హెయిన్ చాలా అద్భుతంగా చేశారు అంటూ సినిమా లెక్కలు తేల్చేశారు.
