Site icon NTV Telugu

ముఖ్యంగా నీకే చెప్తున్నా అల్లు అర్జున్ : రాజమౌళి

Rajamouli

‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా విచ్చేసిన టాప్ డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ సినిమాపై, హీరో అల్లు అర్జున్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ “బన్నీ నీ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ మ్యాన్… నువ్వు పడే కష్టానికి, పెట్టె ఎఫర్ట్స్ కు, డైరెక్టర్ పై నీకున్న నమ్మకాన్ని హ్యాట్సాఫ్… ఇండస్ట్రీకి నువ్వు గిఫ్ట్… నువ్వు చాలా మందికి ఇన్స్పిరేషన్… అలాగే ఎంత కష్టపడితే అంత… నీలా ఎత్తుకు ఎదుగుతాం అనిపించేలా నువ్వు అందరికి ఇన్స్పిరేషన్ గా ఉన్నావ్ ‘పుష్ప’కు ఆల్ ది బెస్ట్ చెప్పక్కర్లే… సినిమా రాక్ చేస్తుందని నాకు తెలుసు… ‘పుష్ప’ సినిమా బాగా ఆడాలని కోరుకోవడంలో నాకు స్వార్థం ఉంది. నాకు మాత్రమే కాదు ఇది తెలుగు సినీ పరిశ్రమ మొత్తం స్వార్థం. తెలుగు సినిమా ఇది మరింత ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను” అంటూ అల్లు అర్జున్ పై, ఆయన డెడికేషన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

https://www.youtube.com/watch?v=eDBTOkrSLHQ
Exit mobile version