దర్శక ధీరుడు రాజమౌళి మీడియాకు క్షమాపణలు చెప్పారు. ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రతి థియేటర్ లోనూ ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ మారుమ్రోగిపోయింది. గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు .. హీరోల ఎలివేషన్స్ చూసి ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఇకపోతే ట్రైలర్ రిలీజ్ తరువాత ట్రిపుల్ ఆర్ టీం ప్రెస్ మీట్ ఉంటుందని తెలిపారు.. అయితే హిందీ ట్రైలర్ ని రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టిన జక్కన్న తెలుగు ట్రైలర్ అనంతరం ప్రెస్ మీట్ ని క్యాన్సిల్ చేశారు.
మీడియాను ఆహ్వానించిన తరువాత ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేయడంతో మీడియాకు జక్కన్న క్షమాపణలు కోరారు. “ప్రెస్‌మీట్ అనుకున్నా.. అయితే ఫ్యాన్స్ కూడా రావడంతో మీడియాకు ఇబ్బంది అయింది, అందుకే హీరోలను తీసుకురాలేదు.. రెండు రోజుల్లో మీడియాకు ప్రత్యేక సమావేశం ఉంటుంది.. ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసినందుకు క్షమించాలి” అని తెలిపారు.
