Rajamouli and team to begin pre-production for SSMB 29: ఆర్ఆర్ఆర్ తరువాత అగ్ర దర్శకుడు రాజమౌళి మహేష్ తో సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కేఎల్ నారాయణ నిర్మాత, విజయేంద్ర ప్రసాద్ రచయిత అనే విషయాలు తప్ప సినిమా గురించి ఎలాంటి వివరాలు లేవు. అప్పుడప్పుడు విజయేంద్ర ప్రసాద్ ఇచ్చే లీకులు తప్ప ఎలాంటి అప్డేట్స్ సినిమా నుంచి లేవు. అయితే తాజాగా సినిమా టీం నుంచి ఒక అప్డేట్ బయటకొచ్చింది. అది ఏమంటే ఆరు నెలల రెస్ట్ మోడ్ తర్వాత కొత్త సంవత్సరం 2024లో, అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ మొదలు పెట్టబోహున్నారు. గ్లోబ్‌ట్రోటింగ్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా చెబుతున్న కొత్త చిత్రానికి ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించనున్నారని అంటున్నారు. తాత్కాలికంగా #SSMB29 అనే టైటిల్‌తో సంబోధించబడుతున్న ఈ సినిమాను హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరించనున్నారు.
RGV: నోరు జారిన రామ్ గోపాల్ వర్మ.. కేసు పెట్టిన బర్రెలక్క..
ఇక అంతే కాకుండా, కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం అనేక జాతీయ – అంతర్జాతీయ లొకేషన్‌లు కూడా షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి. రాజమౌళి, అతని భార్య మరియు కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి అలాగే నిర్మాణ బృందం ఇప్పటికే లొకేషన్లు, కాస్ట్యూమ్స్ మరియు ఇతర వివరాలను ఖరారు చేసే పనిలో ఉన్నారు. ప్రధాన తారాగణం అలాగే క్రూని రాజమౌళి ఫైనల్ చేయాల్సి ఉంది. సినిమాకి ఆయన సోదరుడు, ప్రముఖ సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఇతర కమిట్ మెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ లో పనిచేయకపోవచ్చు. కెఎల్ నారాయణ 20 ఏళ్ల విరామం తర్వాత సినిమా నిర్మాణ రంగంలోకి తిరిగి వస్తూ ఈ సినిమాను నిర్మించనున్నారు.