Site icon NTV Telugu

Rajamouli: ఇంకొక్క సినిమా చేసేయ్యండి మావా బ్రోస్…

Rajamouli

Rajamouli

ఇండియాలో మోస్ట్ సక్సస్ ఫుల్ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ లిస్టు తీస్తే అందులో టాప్ ప్లేస్ లో ఉంటారు రాజమౌళి, ఎన్టీఆర్. స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో ఎన్టీఆర్-రాజమౌళిల ప్రయాణం మొదలయ్యింది. ఇద్దరికీ ఫస్ట్ హిట్ అయిన ఈ మూవీ ఒక సూపర్ హిట్ కాంబినేషన్ కి ఇండస్ట్రీకి ఇచ్చింది. ఫ్యూచర్ లో ఈ కలయిక ఇండస్ట్రీ హద్దులని చెరిపేసే స్థాయికి వెళ్తుందని స్టూడెంట్ నంబర్ 1 రిలీజ్ అయిన రోజు ఎవరూ ఊహించి ఉండరు. మీరు ఊహించనిదే జరగబోతుంది అని ‘సింహాద్రి’ సినిమాతో తెలుగు రాష్ట్రాల ప్రజలకి క్లియర్ గా చెప్పేశారు ఎన్టీఆర్, రాజమౌళి. 20 ఏళ్ల వయసులో ఉన్న ఎన్టీఆర్ ని సింగమలైగా చూపిస్తూ రాజమౌళి బాక్సాఫీస్ పై దండయాత్రనే చేశాడు. రాజమౌళి చూపించాలని అనుకున్న రౌద్రంని అర్ధం చేసుకున్న ఎన్టీఆర్, పాతికేళ్ల వయసు కూడా లేని సమయంలోనే నటవిశ్వరూపం చూపించాడు. సింహాద్రి సినిమా ఎన్టీఆర్, రాజమౌళిలని టాప్ ప్లేస్ లో కూర్చోబెట్టింది. ఇక్కడి నుంచి ఈ ఇద్దరూ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో సాలిడ్ హిట్స్ కొట్టేసిన రాజమౌళి, ఫాంటసీ డ్రామా అనే ప్రయోగం చెయ్యాలి అనుకున్నప్పుడు తను నమ్మిన హీరో ఎన్టీఆర్ వైపు నడిచాడు. ఈ ఇద్దరూ కలిసి మూడో సినిమా ఫాంటసీ డ్రామా ‘యమదొంగ’ చేశారు. ఈ మూవీలో ఎన్టీఆర్ స్లిమ్ లుక్ లో కనిపించాడు. యమదొంగ మూవీ కోసం వేసిన సెట్స్ అప్పటికి చాలా బడ్జట్ తో కూడుకున్నవి. సొంత బ్యానర్ లో రాజమౌళి చేసిన యమదొంగ సినిమా మగధీర, ఈగ, బాహుబలి సినిమాలకి పునాది అయ్యింది. ఎన్టీఆర్ యముడి పాత్రలో తాతకి తగ్గ మనవడిగా అద్భుతమైన డైలాగ్స్ చెప్పి తెలుగు రాష్ట్రాలని ఊపేసాడు. ఇలా ఎన్టీఆర్, రాజమౌళి కలిసిన ప్రతిసారీ ఒక సెన్సేషన్ జరిగింది.

ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ కి మగధీరుడు కూడా కలవడంతో ఈసారి తెలుగు రాష్ట్రాలకి మాత్రమే పరిమితం అవ్వకుండా పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేశారు. పాన్ ఇండియా సరిపోలేదేమో ఏడాది తిరిగేలోపు పాన్ వరల్డ్ ని కబ్జా చేశారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ చేసిన పెర్ఫార్మెన్స్ ని ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే అని చెప్పాలి. అలా ఎన్టీఆర్ లోని నటుడి కెపాసిటీ పూర్తిగా తెలిసిన దర్శకుడిగా రాజమౌళి, ఆ దర్శక ధీరుడు విజన్ ని పర్ఫెక్ట్ గా అర్ధం చేసుకునే హీరోగా ఎన్టీఆర్ ఎప్పటికీ ఒక రెడ్ హాట్ కాంబినేషన్ గా నిలిచిపోయారు.

ఈరోజు ఎన్టీఆర్ 30 మూవీ లాంచ్ లో ఎన్టీఆర్-రాజమౌళిలు మళ్లీ కలిసారు. ఈ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకొక్క సినిమా ఈ హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ లో పడితే ప్రపంచంలో ఉన్న ప్రతి అవార్డ్ ని ఇండియాకి తీసుకోని వచ్చేయ్యొచ్చు. ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ సినిమా ఉంటుంది కానీ అది ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఒక్కటి మాత్రం నిజం ఈ ఇద్దరు ఎప్పుడు కలిసి సినిమా చేసిన అది వరల్డ్ బాక్సాఫీస్ ని షేక్ చేసేలా ఉంటుంది.

Exit mobile version