NTV Telugu Site icon

Rajamouli: హీరోగా మారిన రాజమౌళి.. స్టైలిష్ లుక్ లో అదిరిపోయాడుగా

Rajamouli

Rajamouli

Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి గురించి పరిచయ వ్యాక్యాలు చెప్పనవసరం లేదు. ఆయన తెలియని సినీ ప్రేక్షకుడు ఈ ప్రపంచంలోనే లేడు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఇప్పటివరకు అపజయాన్ని చవిచూడని ఈ దర్శకుడుకు తెరపై కనిపించాలని ఎప్పుడు ఒక కోరిక ఉంది అంట. అందుకే ఆయన ప్రతి సినిమాలో .. ఒక సీన్ లో కానీ, సాంగ్ లో కానీ కనిపిస్తూ ఉంటాడు. ఇక ఆ కోరికే రాజమౌళిని ఇలా హీరోను చేసింది. హీరో అనగానే.. ఏదో పెద్ద సినిమా అనుకోకండి.. యాడ్ ఫిల్మ్ కు హీరో.. మొట్ట మొదటిసారి రాజమౌళి ఒక యాడ్ లో నటించబోతున్నాడు. ఒప్పో(oppo) ఫోన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. ఇక ఈ యాడ్ కోసం విదేశాల్లో షూటింగ్ జరుగుతుంది. ఈ యాడ్ షూట్ ను ఒక బాలీవుడ్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

Chiranjeevi: బిగ్ బ్రేకింగ్.. చిరును కలిసిన గంటా శ్రీనివాస్.. ఎందుకు..?

తాజాగా ఈ యాడ్ కు సంబంధించిన షూటింగ్ మేకింగ్ వీడియో నెట్టింట ప్రత్యక్షమయ్యింది. ఇక వైట్ సూట్.. తెల్ల గడ్డంతో రాజమౌళి అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదిరిపోయాడు. ఒక చేతిలో ఫోన్ పట్టుకోని అలా నడుస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ యాడ్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. దీనికోసం రాజమౌళి పెద్ద మొత్తాన్నే అందుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక రాజమౌళి లుక్ చూసిన అభిమానులు.. జక్కన్న.. నువ్వు కూడా హీరో అయిపోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ తో ఒక సినిమా ప్రకటించాడు. శరవేగంగా ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Show comments