Site icon NTV Telugu

Raja Saab: ప్రభాస్ సినిమా ప్లాట్ లీక్ చేసిన ఐఎండీబీ.. అరెరే ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా మరి.

Maruthi

Maruthi

Raja Saab Plot leaked in IMDB Here is the Maruthi Reaction:ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాని టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిపూడి నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది కానీ ఇప్పటివరకు సినిమా నుంచి ఒక్క ఫోటో కూడా బయటకు లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాలో ప్రభాస్ జాతకాలు చెబుతాడని ఒక ప్రచారం జరిగింది. తర్వాత ప్రభాస్ ఒక పెద్ద బంగ్లాలో ఉంటాడని, దాని పేరు రాజా డీలక్స్ అని ప్రచారం జరిగింది. సినిమాకి టైటిల్ కూడా రాజా డీలక్స్ అని పెడతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజా సాబ్ అనే టైటిల్ ఫిక్స్ చేసి సంక్రాంతి సందర్భంగా అనౌన్స్ కూడా చేశారు.

Ajay Gadu: జీ5లో ఫ్రీగా ‘అజ‌య్‌గాడు’ సినిమా స్ట్రీమింగ్

అయితే ఈ సినిమాకి సంబంధించి ఇండియన్ మూవీ డేటా బేస్ వెబ్సైట్ ఒక ఆసక్తికరమైన ప్లాట్ రాశారు. అదేంటంటే ఈ సినిమా కథ ఒక జంట మధ్య జరుగుతుందని ప్రేమలో పడిన వారు పెళ్లి చేసుకోకుండా ఒక నెగిటివ్ ఎనర్జీ వారిని ఇబ్బంది పెడుతుందని రాసుకొచ్చారు. ఇక ఈ స్క్రీన్ షాట్ షేర్ చేస్తూ డైరెక్టర్ మారుతి ఆసక్తికరంగా స్పందించారు. అరెరే నాకు ఈ సినిమా ప్లాట్ ఇలా ఉంటుందని తెలియదే. నాకు తెలియక వేరే స్క్రిప్ట్ తో షూటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఐఎండీబీ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా మరి అంటూ ప్రశ్నించారు. దీంతో ఈ ట్వీట్ మీద ప్రభాస్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా మాళవిక మోహనన్ నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. అలాగే మరో ఐదారు గురు భాములు కూడా కథలో భాగంగా కనిపిస్తారని అంటున్నారు.

Exit mobile version