NTV Telugu Site icon

Raja Saab: రాజా సాబ్ టీజర్.. ఏంటి మారుతీ బ్రో.. ఫ్యాన్స్ ను అంత మాట అనేశావ్..?

Prabhas Maruthi Film Title

Prabhas Maruthi Film Title

Raja Saab: సలార్ తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో రాజా సాబ్ ఒకటి. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిపూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హర్రర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని టాక్. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ నటిస్తుండగా.. మరో ముగ్గురు హీరోయిన్లు ప్రత్యేక పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రభాస్ ను ఈ మధ్యకాలంలో యాక్షన్ కథల్లోనే చూసాం.. ఇక ఈ సినిమాలో మారుతీ.. డార్లింగ్ ను వింటేజ్ డార్లింగ్ గా మార్చనున్నాడని తెలుస్తోంది. అందుకే ఈ చిత్రం కోసం అభిమానులు బాగా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు సోషల్ మీడియాకు, ఫ్యాన్స్ కు దూరంగా ఉన్న మారుతీ.. ఈ మధ్య ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ హైప్ క్రియేట్ చేస్తున్నాడు.

నిన్నటికి నిన్న IMDBలో రాజాసాబ్ స్టోరీ ఇదే అంటూ రాసుకురాగా.. దానికి మారుతీ తనదైన రీతిలో సమాధానం చెప్పుకొచ్చాడు. అరెరే నాకు ఈ సినిమా ప్లాట్ ఇలా ఉంటుందని తెలియదే. నాకు తెలియక వేరే స్క్రిప్ట్ తో షూటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఐఎండీబీ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా మరి అంటూ సెటైర్ వేశాడు. ఇక మరో ప్రభాస్ ఫ్యాన్.. మాకు ఏమన్నా నెక్స్ట్ మంత్.. టీజర్ కానీ గ్లింప్స్ కానీ రిలీజ్ చేయొచ్చుగా అన్న ప్రశ్నకు మారుతీ.. అప్పుడే టీజరా..అంటూ వెంకీ సినిమాలోని క్లిప్ ను యాడ్ చేసాడు. మీతో నాకు కుదరదు అండి.. మీరేదో తేడా మనుషుల్లా ఉన్నారు అని కృష్ణభగవాన్ డైలాగ్ ను చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఏంటి మారుతీ బ్రో.. ఫ్యాన్స్ ను అంత మాట అనేశావ్..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ టీజర్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Show comments