యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న విభిన్న కథా చిత్రం “రాజ రాజ చోర”. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. “రాజ రాజ చోర” ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆగష్టు 15న, సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో నిర్వహించనున్నారు. “చోరుడు వస్తున్నాడు జాగ్రత్త ! ఎవరి వస్తువులకు వాళ్లే బాధ్యులు” అంటూ వినూత్నంగా హీరోను దొంగాగా చూపించి, ఆ దొంగను హీరోను చేసే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్.
Read Also : “పుష్ప”రాజ్ ఆల్ టైం రికార్డు
పోస్టర్లతోనే ఆసక్తిని పెంచేసిన ఈ చిత్రంలో మేఘా ఆకాశ్, సునయన హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకుడు. దీనికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా, కీర్తి చౌదరి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తనికెళ్ళ భరణి, రవిబాబు,కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్,వాసు ఇంటూరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం వివేక్ సాగర్ సమకూర్చారు.
