Site icon NTV Telugu

సెన్సార్ పూర్తి చేసుకున్న “రాజ రాజ చోర”

Raja Raja Chora Movie Completes Censor

యాక్షన్, కామెడీ అండ్ రొమాంటిక్ మూవీ “రాజ రాజ చోర”. ఈ చిత్రంలో శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్, లవ్లీ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, తనికెళ్ల భరణి, సత్య సహాయక పాత్రలు పోషిస్తున్నారు. హసీత్ గోలీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌లపై టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ బాణీలు అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ వేద రామన్ శంకరన్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్, లవ్లీ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, తనికెళ్ల భరణి, సత్య సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 19న విడుదల చేయనున్నారు.

Read Also : “భీమ్లా నాయక్” వచ్చేశాడు… పవర్ ప్యాక్డ్ గ్లిమ్స్

తాజాగా “రాజ రాజ చోర” మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాపై ప్రశంసలు కురిపించిన సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ మరియు పాటలు ఇప్పటికే సినిమా ప్రియులలో మంచి అంచనాలను పెంచాయి. రాజవరపు భాస్కర్ రాజు అనే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఒక దొంగ పాత్రలో శ్రీ విష్ణు నటిస్తున్నాడు. శ్రీ విష్ణు చివరిగా అనిష్ కృష్ణ దర్శకత్వం వహించిన “గాలి సంపత్‌”లో కనిపించారు. ఇప్పుడు శ్రీ విష్ణు “రాజ రాజ చోర” మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు.

Exit mobile version