Site icon NTV Telugu

హైయెస్ట్ రేటెడ్ మూవీగా “రాజరాజ చోర”

Raja Raja Chora Highest rated and Most loved movie after second lockdown

యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “రాజ రాజ చోర” సెకండ్ వీక్ కూడా మంచి కలెక్షన్లతో, పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. సెకండ్ లాక్ డౌన్ తరువాత ఈ మూవీ హైయెస్ట్ రేటింగ్ అండ్ మోస్ట్ లవ్డ్ మూవీగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బుక్ మై షో యాప్ లో 86%, పే టీఎమ్ లో 92% రేటింగ్ నమోదు చేసుకోవడం విశేషం. మంచు విష్ణు చెప్పినట్టుగానే కింగ్ సైజ్ హిట్టు కొట్టాడు.

Read Also : సెప్టెంబర్ సినిమాల రిలీజ్ లలో భారీ మార్పులు

సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఫస్ట్ హాఫ్ కామెడీతో నవ్విస్తుంది, సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా ఏడిపిస్తుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని, దర్శకుడు హసిత్ గోలి తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడని విమర్శకులు సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. “రాజ రాజ చోర” టీం అంతా కలిసి ప్రేక్షకుల మనసులను దోచేశారు.

యాక్షన్, కామెడీ అండ్ రొమాంటిక్ మూవీ “రాజ రాజ చోర” చిత్రంలో శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్, సునైనా ప్రధాన పాత్రలు, తనికెళ్ల భరణి, సత్య సహాయక పాత్రలు పోషించారు. హసీత్ గోలీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌లపై టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. వివేక్ సాగర్ బాణీలు అందించగా, సినిమాటోగ్రఫీ వేద రామన్ శంకరన్ నిర్వహించారు.

Exit mobile version