ఎనిమిదేళ్ళ క్రితం రాజ్ తరుణ్ ను ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో పరిచయం చేశాడు నాగార్జున. ఆ తర్వాత ఐదేళ్ళకు రాజ్ తరుణ్ తోనే ‘రంగుల రాట్నం’ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. మళ్లీ ఇప్పుడు ముచ్చటగా రాజ్ తరుణ్ తో మూడో సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు నాగార్జున. హడావుడీ లేకుండా మొదలైన ఆ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందట. 2016లో రాజ్ తరుణ్ హీరోగా ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రాన్ని రూపొందించిన శ్రీనివాస్ గవిరెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. మోడల్ కాషిశ్ ఖాన్ ఈ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు ‘అనుభవించు రాజా’ అనే టైటిల్ ను ఖరారు చేయబోతున్నట్టు తెలుస్తోంది. గత యేడాది కరోనా టైమ్ లో రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ ఓటీటీలో విడుదలైంది. ఈ యేడాది మార్చిలో ‘పవర్ ప్లే’ మూవీ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది కానీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. అయితే… రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ ‘స్టాండప్ రాహుల్’కు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అదే వేడిలో ‘అనుభవించు రాజా’ కూడా విడుదలై విజయపథంలో సాగుతుందేమో చూడాలి.
‘అనుభవించు రాజా’ అంటున్న రాజ్ తరుణ్!
