పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన రాజ్ కుంద్రా.. బెయిల్‌పై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఇప్పటికి మూడు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించి కుంద్రా విఫలమయ్యారు. తాజాగా బాంబే హైకోర్టు బెయిల్ నిరాకరించింది. రాజ్ కుంద్రా బాలీవుడ్ లోని మోడల్స్ తో పోర్న్ కంటెంట్ వీడియోలను తీసి యాప్ లలో అప్ లోడ్ చేస్తున్నట్టు పక్కా ఆధారాలతో గుర్తించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేశారు. రోజుకో కొత్త విషయాలు ఈ కేసులో వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. కుంద్రాకు మరింత ఉచ్చు బిగుస్తుంది.
తనను చట్టానికి విరుద్ధంగా అక్రమంగా అరెస్టు చేశారని.. కోర్టులను ఆశ్రయిస్తున్న రాజ్ కుంద్రాకు కోర్టులు వరుసగా షాక్ ఇస్తున్నాయి. కుంద్రా కేసులో షెర్లిన్‌ను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎనిమిది గంటలపాటు విచారించారు. రాజ్‌కుంద్రా ప్రొడక్షన్ హౌస్ గురించి ఆమెను అడిగి తెలుసుకున్నారు. రాజ్‌కుంద్రా అసభ్యకరమైన పనులు చేపిస్తాడని తాను అనుకోలేదంటోంది షెర్లిన్‌చోప్రా. రాజ్ కుంద్రా బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు షెర్లిన్ చోప్రాను చూసి మరికొందరు ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో కుంద్రా చిక్కుల్లో కూరుకుపోతున్నారు.
