NTV Telugu Site icon

Raai Laxmi: పాల మీగడ లాంటి దేహంపై నల్లని బికినీ.. కుర్రకారుకు నిద్ర కరువే

Lakshmi

Lakshmi

Raai Laxmi: రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు.. నిన్ను చూస్తే గల్ గల్ అన్నాయి నా చొక్కా బొత్తాలు.. అంటూ చిరంజీవి సరసన ఆడిపడిన లక్ష్మీరాయ్ గుర్తుందిగా.. కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది లక్ష్మీ రాయ్. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అని తేడా లేకుండా వరుస అవకాశాలను అందుకొని స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ లోనూ అమ్మడు తన సత్తా చాటింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోల సరసన ఐటెం సాంగ్స్ లో మెరిసి మెప్పించింది. మొదటి నుంచి బొద్దుగా.. ముద్దుగా ఉండే లక్ష్మీరాయ్ ఈ మధ్య బక్కచిక్కి జీరో సైజులోకి మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు ఏమీ లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం హాట్ ఫోటోషూట్స్, బికినీ షూట్స్ లో అందాల ఆరబోత చేస్తూ కుర్రకారును మత్తెక్కిస్తోంది.

Fahadh Faasil: పుష్పకు అవార్డ్.. రూ. 2 కోట్లు పెట్టి కొత్త కారు కొన్న షెకావత్ సారూ

తాజాగా ఈ చిన్నది బికినీతో సోషల్ మీడియాని హీట్ ఎక్కించింది. బ్లాక్ బికినీతో స్విమ్మింగ్ పూల్ వద్ద అలా నిలబడి కూల్ ఫోజ్ ఇచ్చింది. అది కూల్ గా ఆమె నిలబడినా చూసేవారికి మాత్రం సెగలు పుట్టిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పాలమీగడ లాంటి దేహంపై బ్లాక్ బికినీ వేసుకొని అప్సరసలా కనిపించింది. అమ్మడి పాలమీగడలాంటి దేహం చూసి కుర్రకారుకు నిద్ర కరువే అని అభిమానులు అంటున్నారు.. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. సినిమా అవకాశాలు లేకపోవడంతో అమ్మడు ఈ విధంగా అందాల ఆరబోత చేస్తుందని అభిమానులు చెప్పకు వస్తున్నారు. మరి ముందు ముందు లక్ష్మీరాయ్ ఏమైనా అవకాశాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Show comments