NTV Telugu Site icon

Rahul Ramakrishna: పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న అర్జున్ రెడ్డి కమెడియన్

Rahul

Rahul

Rahul Ramakrishna: అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండను మర్చిపోవడం ఎంత కష్టమో, అతని స్నేహితుడు శివగా నటించిన రాహుల్ రామకృష్ణ ను మర్చిపోవడం కూడా అంతే కష్టం. ఒక స్నేహితుడు బాధలో ఉన్నప్పుడు ఎలా ఓదార్చాలి, ఎలా అండగా ఉండాలి అనేది శివ చూపిస్తాడు. అందుకే అతడికి ఎక్కువగా కనెక్ట్ అయిపోయారు అభిమానులు. ఇక ఈ సినిమాతో రాహుల్ రామకృష్ణ కు స్టార్ స్టేటస్ వచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం రాహుల్ స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. ఇక సినిమాల్లో ఎలా ఉన్నా సోషల్ మీడియా లో రాహుల్ కొద్దిగా వివాదాలను కొనితెచ్చుకొనే ట్వీట్స్ చేస్తూ అభిమానుల చేత విమర్శలు అందుకుంటున్నాడు.

మొన్నటికి మొన్న తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ లిప్ లాక్ ఇస్తున్న ఫోటోను షేర్ చేశాడు. ఫోటో కొంచెం ఎబెట్టుగా అనిపించినా బార్యతోనే కదా అని సరిపెట్టుకొని అందరూ విషెస్ చెప్పారు. ఇక ఆ తరువాత పెళ్లి తేదీ కానీ, పెళ్లి అయినట్లు కానీ ఎక్కడా సమాచారం కూడా లేదు. ఇక తాజాగా తన భార్య ప్రెగ్నెంట్ అని చెప్పి షాక్ ఇచ్చాడు. ” మా లిటిల్ ఫ్రెండ్ కు హాయ్ చెప్పండి” అంటూ తన భార్య ప్రెగ్నెంట్ గా ఉన్న ఫోటోను చూపించాడు. దీంతో అభిమానులందరూ షాక్ అవుతున్నారు. మీకు పెళ్లి ఎప్పుడు అయ్యింది అని కొందరు అంటుండగా.. లివింగ్ రిలేషన్ లా అనిపిస్తుందే అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది ఏమో ఎవరికి తెలియకుండా చేసుకున్నారేమో.. అని అంటూ వారికి కంగ్రాట్స్ అని తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Show comments