ఎంత మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చినా.. సంగీత దర్శకుల్లో ఏఆర్ రెహమాన్ రూటే సపరేటు. ఈ మధ్య కొంచెం రెహమన్ పాటల సందడి తగ్గినప్పటికీ.. అతని క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదనే చెప్పాలి. అందుకు నిదర్శనమే తాజాగా వచ్చిన ఓ సాంగ్ అని చెప్పొచ్చు. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తున్న చిత్రాల్లో కోబ్రా కూడా ఒకటి. ఇందులో కెజియఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మే 25న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ధీరా.. అధీరా.. అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఇప్పుడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రెహమాన్ మార్క్‌తో వచ్చిన ఈ సాంగ్.. కోబ్రా మూవీలో హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం వరుస హిందీ, తమిళ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు రెహమాన్.
Watch Acharya Pre release Event Live :
ఇదిలా ఉంటే.. రెహమాన్ తెలుగులో డబ్బింగ్ సినిమాలతో అలరిస్తున్నప్పటికీ.. తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు సంగీతం అందించి చాలా కాలమే అవుతోంది. చివరగా నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రానికి సంగీతం అందించాడు రెహమాన్. అయితే ఈ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించడంతో.. డైరెక్ట్ తెలుగు సినిమా అని కూడా చెప్పలేం. దాంతో రెహమాన్ తెలుగు సినిమాలకు పని చేసి చాలా ఏళ్లవుతోందని చెప్పొచ్చు. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత రెహమాన్ ఓ అచ్చ తెలుగు సినిమాకు సంగీతం అందించబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోందని చాలా రోజులుగా వినిపిస్తోంది. అయితే ఇంకా అధికారిక ప్రకటన కూడా రాలేదు.. కానీ ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించబోతున్నట్టు సమాచారం. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీర్, కొరటాల కాంబోలో ఓ సినిమా రాబోతోంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఓ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ తర్వాతే బుచ్చిబాబు సినిమా ఉండొచ్చని అంటున్నారు. ఏదేమైనా రెహమాన్ మ్యూజిక్ అందిస్తే.. ఈ సినిమ పై మరింత హైప్ రావడం ఖాయమంటున్నారు.
