NTV Telugu Site icon

Lawrence: గురువుకే గుదిబండలా మారిన లారెన్స్?

Raghava Lawrence As Villian For Rajinikanth

Raghava Lawrence As Villian For Rajinikanth

Raghava Lawrence becomes the villain for Rajinikanth: సైడ్ డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా, నటుడిగా డైరెక్టర్ గా అలరిస్తున్న లారెన్స్ ఇప్పుడు తాను గురువుగా చెప్పుకునే రజనీకాంత్ కే గుదిబండలా మారినట్టు తెలుస్తోంది.  అయ్యో టెన్షన్ పడకండి రజనీకాంత్‌కి లారెన్స్ విలన్‌గా మారాడు. అవును, రాఘవ లారెన్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ కీ వ్యతిరేకంగా విలన్‌గా నటించడానికి సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసమే రజనీకాంత్‌కు లారెన్స్ విలన్‌గా మారాడని కోలీవుడ్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ భారీ చిత్రానికి కథ, నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై చాలా సమయం వెచ్చిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా లారెన్స్‌ని లోకేష్ ఖరారు చేసినట్లు సమాచారం.

Bharateeyudu 2: భారతీయుడుకు చావే లేదు.. సేనాపతి తిరిగి వచ్చాడు

రాఘవ లారెన్స్ సూపర్ స్టార్ రజనీకి వీరాభిమాని కావడం విశేషం. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న విక్రమ్ చిత్రంలో సంతానం పాత్రను పోషించాలని మొదట లోకేష్ లారెన్స్‌ను సంప్రదించగా, ఆ పాత్ర డ్రగ్స్‌తో సంబంధం ఉన్న పాత్ర కావడంతో లారెన్స్ తిరస్కరించాడు. ఇప్పుడు, చివరకు, రజనీకాంత్ కోసం విలన్ గా మారుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో సంబంధం లేకుండా ఒక స్వతంత్ర ప్రాజెక్ట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. తలైవర్ 171గా చెబుతున్న ఈ ప్రాజెక్టు రజనీకాంత్ విలనిజాన్ని మనకి చూపిస్తుందని లోకేశ్ ఇటీవల వెల్లడించడంతో రజనీ అభిమానులు క్లౌడ్ నైన్‌లో ఉన్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం, తలైవర్ 171 మార్చి లేదా ఏప్రిల్ 2024లో సెట్స్‌పైకి తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనుండగా సన్ పిక్చర్స్ నిర్మించనుంది. సినిమాలో నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు ఇంకా ధృవీకరించబడలేదు.