Radhika Apte : హీరోయిన్ రాధిక ఆప్టే ఎప్పటికప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూనే ఉంది. తాజాగా మరో బాంబు పేల్చింది. తాను ప్రెగ్నెంట్ గా ఉన్న టైమ్ లో ఓ నిర్మాత ఎలా ఇబ్బంది పెట్టాడో బయట పెట్టింది. తెలుగులో ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన రక్తచరిత్ర సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. బాలయ్యతో లెజెండ్ మూవీలోనూ యాక్ట్ చేసింది. ఇప్పుడు లండన్ లోనే ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ షాకింగ్ విషయాలు చెప్పింది. నేను సౌత్ లో ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు ప్రెగ్నెంట్ అయ్యా. నాకు మూడు నెలల ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చాలా ఫుడ్ తినేదాన్ని. దాంతో కొంచెం లావు అయ్యాను. అయినా షూటింగ్ ను ఆపలేదని తెలిపింది.
Read Also : Anchor Ravi : బిగ్ బాస్ కు వెళ్తే నాశనమే.. యాంకర్ రవి సంచలనం..
ఆ మూవీ కోసం టైట్ డ్రెస్సులు వేసుకోవాలని నిర్మాత చెప్పాడు. కానీ ప్రెగ్నెన్సీ వల్ల నాకు చాలా ఇబ్బంది కలిగింది. ఆ విషయాన్ని చెప్పినా సరే అతను వినిపించుకోలేదు. షూటింగ్ చేసేటప్పుడు ఆయాసం వస్తున్నా అతను అలాగే చేయాలన్నాడు. చాలా అన్ కంఫర్టబుల్ గా అనిపించింది. అతనికి ఎంత చెప్పినా కొన్ని సీన్స్ బలవంతంగా చేయించాడు అంటూ ఎమోషనల్ అయింది రాధికా ఆప్టే. అయితే ఆ ప్రొడ్యూసర్ పేరు మాత్రం బయటపెట్టలేదు. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఎవరా నిర్మాత అని అందరూ ఆరా తీస్తున్నారు.
Read Also : HHVM : హిందు వర్సెస్ ముస్లిం కాదు.. వీరమల్లుపై పవన్ క్లారిటీ..
