NTV Telugu Site icon

Radhika Apte: 14 ఏళ్ల తర్వాత స్పెషల్ ఆఫీసర్ అవతారం ఎత్తిన సాధారణ హౌజ్ వైఫ్

Mrs Undercover

Mrs Undercover

మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ లిస్టులో మిస్ అవ్వకుండా ఉండే పేరు ‘రాధిక ఆప్టే’ది. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల రాధిక ఆప్టే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాత మరిన్ని ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తోంది. గ్లామర్ షో చెయ్యడానికైనా, యాక్టింగ్ ఓరియెంటెడ్ పాత్రలో నటించడానికి అయినా సిద్ధంగా ఉండే రాధికా మరోసారి ఎవరూ ఊహించని ఒక పాత్రలో నటిస్తున్న సినిమా ‘మిసెస్ అండర్ కవర్’. ‘కామన్ మాన్’ అనే పేరుతో మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న అమ్మాయిలని చంపే సైకో కిల్లర్ ని పట్టుకోవడానికి… ఒక సాధారణ హౌజ్ వైఫ్ ఎలాంటి మిషన్ కి రెడీ అయ్యింది అనే కథతో మిసెస్ అండర్ కవర్ సినిమా తెరకెక్కింది. ‘దుర్గ’ అనే పాత్రలో హౌజ్ వైఫ్ గా 12 ఏళ్ల పాటు తన జీవితాన్ని సాగిస్తున్న రాధిక ఆప్టే, సైకోని పట్టుకోవడానికి తిరిగి స్పెషల్ ఆఫీసర్ గా ఎలా మారింది? సైకోని ఎలా పట్టుకుంది అనే ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ తో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఫన్, యాక్షన్, డ్రామా లాంటి ఎమోషన్స్ తో పర్ఫెక్ట్ గా కట్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేలా ఉంది.

అనుశ్రీ మెహతా దర్శకత్వం ఈ చిత్రంలో సుమీత్ వ్యాస్, రాజేష్ శర్మ మరియు సాహెబ్ ఛటర్జీ కూడా కీలక పాత్రలలో నటించారు. ఏప్రిల్ 14న #ZEE5లో ప్రీమియర్ కానున్న మిసెస్ అండర్ కవర్ సినిమాపై ఈ ట్రైలర్ అంచనాలు పెంచింది. ఒకప్పటి స్పెషల్ ఆఫీసర్ గా, ఇప్పుడు ఉన్న ఒక మాములు హౌజ్ వైఫ్ గా రాధిక ఆప్టే ఆకట్టుకుంది. తన రెండు వేరియేషన్స్ ని రాధిక ఆప్టే పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసింది. భర్త, అత్తా, మామ, పిల్లలు… ఇలాంటి బంధాలు తనకి ‘కేవలం హౌజ్ వైఫ్’ అనే మాటకి పరిమితం చేశాయి, పితృస్వామ్య వ్యవస్థలో చిక్కుకున్నాను… ఇప్పుడు నేను కిల్లర్ ని పట్టుకోవడం కోసమే కాదు నేను ‘సాధారణ హౌజ్ వైఫ్’ అనే చిన్న చూపుని చెరిపెయ్యడానికి తిరిగి ఆఫీసర్ అవతారం ఎత్తాలి అని రాధిక ఆప్టే నిర్ణయించుకున్న తర్వాత ఏం చేసింది అనేది సినిమా చూసే తెలుసుకోవాలేమో.

Show comments