యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా.. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తూ ఉంది. ఇక ఈ వాయిదాలకు ఫుల్ స్టాప్ పెడుతూ మార్చి 11 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా రేపు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ ని రేపు మధ్యాహ్నం 1.43 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. పోస్టర్ లో పూజా రంగులు చల్లుతూ కనిపించగా.. ప్రభాస్ బ్యాక్ గ్రౌండ్ లో ఆలోచిస్తున్నట్లు చూపించారు. పోస్టర్ ని అంతా రంగులతో, పూలతో నింపేసి ప్రేమను కురిపించేశారు. మరి రేపు రాబోయే ఆ వీడియోలో రాధేశ్యామ్ ల ప్రేమను చూడడానికి అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
