సాధారణంగా యంగ్ రెబల్ స్టార్ తో పని చేసిన నటీనటులంతా ఆయన చాలా కూల్ అని చెబుతూ ఉంటారు. అయితే అలాంటి మన రెబల్ స్టార్ కు మాత్రం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తీరు ఏమాత్రం నచ్చడం లేదట. దీంతో ప్రభాస్ ఆమెపై కోపంగా ఉన్నాడని, వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్లను కూడా విడివిడిగా చిత్రీకరించారని, ఆమె సెట్లో ఎవరితో ఎలా ప్రవర్తిస్తుందో అందరూ తిరిగి అలాగే ప్రవర్తించాలని నిర్ణయించుకున్నట్లు పలు వార్తలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైగా పూజా హెగ్డే షూటింగ్ సెట్ కు కూడా లేట్ గా వచ్చేదని ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రభాస్, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా “రాధేశ్యామ్” రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పూజా హెగ్డేపై వస్తున్న రూమర్స్ పై “రాధేశ్యామ్” మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
Read Also : అనుష్క నెక్స్ట్ మూవీ క్రేజీ హారర్ సీక్వెల్
ఓ నేషనల్ మీడియాతో మాట్లాడిన “రాధేశ్యామ్” మేకర్స్ ప్రభాస్, పూజాహెగ్డేకు పడట్లేదని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ నిరాధారమైన వార్తలని, ఈ స్టార్స్ ఇద్దరూ బాగున్నారని చెప్పారు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ అద్భుతమని, ఈ జంట తెరపై అందరినీ అలరిస్తుందని అన్నారు. ఇక సెట్లో పూజా హెగ్డే ప్రవర్తన, షూటింగ్ కు లేట్ గా రావడం విషయాలపై మేకర్స్ మాట్లాడుతూ పూజ మంచి టైం సెన్స్ పాటిస్తుందని, ఆమెతో పని చేయడం కంఫర్ట్ గా ఉంటుందని అన్నారు. దీంతో క్రేజ్ పెరిగే కొద్దీ బుట్టబొమ్మ ఇగోకు ఎక్కువవుతోంది అంటూ వస్తున్న రూమర్లపై క్లారిటీ వచ్చేసింది.
ఇక “రాధే శ్యామ్” సినిమా 1970ల కాలంలో యూరప్ నేపథ్యంలో ఉంటుంది.ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ 2022లో విడుదల కానుంది. ప్రభాస్ దక్షిణాది నుండి బాలీవుడ్ వరకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అప్డేట్స్ కోసం కూడా రెబల్ స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
