Site icon NTV Telugu

Radheshyam : బుక్ మై షోకు డైరెక్టర్ రిక్వెస్ట్

radhakrishna

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన “రాధే శ్యామ్” ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ ఆఫ్‌లైన్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండగా, దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ఆన్‌లైన్‌లో హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఆదివారం రాధాకృష్ణ అభిమానుల ప్రశ్నలకు సోషల్ మీడియా వేదికగా సమాధానాలు ఇచ్చారు. ఈ తాజా సెషన్‌లో ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్ బుక్ మై షోలో చిత్రాన్ని మార్చమని ఒక అభిమాని అడిగాడు. టీమ్‌కి సమాచారం ఇస్తానని ఆ వ్యక్తికి రిప్లై ఇచ్చిన డైరెక్టర్ రాధాకృష్ణ ఈరోజు బుక్ మై షోకు పిక్ మార్చాలంటూ రిక్వెస్ట్ చేశాడు. “డియర్ బుక్ మై షో టీమ్, రాధే శ్యామ్ సినిమా పోస్టర్‌ని మార్చాలన్న మా అభ్యర్థనను దయచేసి పరిశీలించగలరా?” అని ట్వీట్ చేశాడు.

Read Also : Sonakshi Sinha : స్టార్ హీరోయిన్ పై నాన్ బెయిలబుల్

అయితే దర్శకుడి రిక్వెస్ట్ పై బుక్ మై షో ఇంత వరకూ స్పందించలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు ఆన్‌లైన్ టికెట్ పోర్టల్‌ పై మండిపడుతున్నారు. ఇక డైరెక్టర్ ట్వీట్ ను చూసిన అభిమానులు పాత పోస్టర్‌ను భర్తీ చేయడానికి కొత్త పోస్టర్‌లను కూడా రూపొందించారు. మరి బుక్ మై షో డైరెక్టర్ రిక్వెస్ట్ పై ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.

Exit mobile version