12 దేశాల్లో ‘రాధేశ్యామ్’ వీఎఫ్ఎక్స్ పనులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్” ఇప్పుడు నిర్మాణ ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ చిత్రం 2022 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పుడు ఈ చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ‘రాధే శ్యామ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ఆసక్తికరమైన అప్డేట్ను ఇచ్చారు. “ట్రైలర్లో చూపిన విఎఫ్ఎక్స్ వర్క్ కు అందరూ ఆశ్చర్యపోతున్నారు. క్రెడిట్ మొత్తం విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కమల్ కణ్ణన్‌కే చెందుతుంది. సినిమా కోసం అత్యుత్తమ అవుట్ పుట్ అందించడానికి వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ‘రాధే శ్యామ్’ విఎఫ్ఎక్స్ పనులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 దేశాల్లో జరుగుతున్నాయి” అని రాధా కృష్ణ అన్నారు.
“రాధే శ్యామ్” విఎఫ్ఎక్స్ పనులు 12 దేశాల్లో జరుగుతున్నాయని దర్శకుడు చెప్పడం చూస్తుంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస మాట్లాడుతూ “రాధే శ్యామ్” అందమైన విజువల్ కథనాన్ని అందిస్తారని, పెద్ద స్క్రీన్లపై మిస్ కాకూడదని అన్నారు. ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో నటించిన “రాధే శ్యామ్”ను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడుతుందా ? అనుకున్న సమయానికే వస్తుందా ? అంటే అది నిర్మాతల చేతుల్లో ఉంటుందని చెప్పుకొచ్చారు దర్శకుడు రాధాకృష్ణ.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!