యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన రొమాంటిక్ పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’. ఫాంటసీ ఎలిమెంట్స్‌తో పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లపై తాజాగా దృష్టి పెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశారు. “ఈ రాతలే” పాట ఘన విజయం సాధించిన నేపథ్యంలో ‘రాధే శ్యామ్’ నిర్మాతలు ఇప్పుడు సినిమా నుండి మరో సింగిల్‌ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
Read Also : బాలయ్య నోట జూనియర్ ఎన్టీఆర్ మాట !
వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్ సాంగ్ లాంచ్‌కు ముందు దాని టీజర్ రేపు విడుదల కానుంది. ‘రాధేశ్యామ్’ లవ్ ఆంథెమ్ సెకండ్ సాంగ్ హిందీ టీజర్‌ని మధ్యాహ్నం 1 గంటలకు లాంచ్ చేయనుండగా, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్‌లను రాత్రి 7 గంటలకు లాంచ్ చేయనున్నారు. గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్ ద్వారా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ను రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణం రాజు సమర్పిస్తారు. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మాతలు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బహుభాషా చిత్రం ‘రాధే శ్యామ్’ జనవరి 14, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది.