Site icon NTV Telugu

భారీ రేటుకు అమ్ముడైన “రాధే శ్యామ్” ఓవర్సీస్ రైట్స్

Radhe Shyam overseas rights sold to Great India Films

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు వేడుకలకు భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ అభిమానులు ఆయన కోసం ప్రత్యేక పూజలు, అన్నదానం, రక్తదానం వంటి పలు సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నారు. మరోవైపు ఆయన నటిస్తున్న సినిమాల నుండి అభిమానుల కోసం సర్‌ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే “రాధే శ్యామ్” టీమ్ రేపు టీజర్ రిలీజ్‌తో ప్రమోషన్స్ ప్రారంభిస్తారు. “రాధే శ్యామ్” టీజర్ రేపు ఉదయం 11:16 గంటలకు విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ రేటుకు అమ్ము డయ్యాయి.

Read Also : మరో సీనియర్ హీరోతో ‘ఆహా’ చర్చలు

గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ “రాధే శ్యామ్” ఓవర్సీస్ రైట్స్ ను భారీ మొత్తానికి దక్కించుకున్నాయి. వారు యూఎస్ఏ, కెనడాలో “రాధే శ్యామ్”ను భారీ రేంజ్ లో విడుదల చేయనున్నారు. “రాధే శ్యామ్” యూఎస్ ప్రీమియర్‌లు 13 జనవరి 2022 న ప్రదర్శితం అవుతాయి. ఇక కర్ణాటక హక్కులను స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్ కొనుగోలు చేసింది. కర్ణాటక వ్యాప్తంగా సినిమాను స్వాగత్ సంస్థ విడుదల చేస్తుంది. కాగా “రాధే శ్యామ్” 2022 జనవరి 14న పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Exit mobile version