కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఒకటి. ఏ ముహూర్తాన ఈ సినిమాను మొదలుపెట్టారో.. అప్పటినుంచి ఈ సినిమా విడుదలకు అడ్డంకుల మీద అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి పక్కా అని ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టగా అంతలోనే కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో మరోసారి వాయిదా పడింది. ఇక ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే అందుకుంటున్న సమాచారం ప్రకారం ‘రాధేశ్యామ్’ ను మార్చి నెలలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అప్పటికి కరోనా కట్టడి కొద్దిగా తగ్గుతుందని, థియేటర్లు కొద్దిగా నిండుకుంటాయని మేకర్స్ భావిస్తున్నారట.
మార్చి 18 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట యూవీ క్రియేషన్స్. ఫిబ్రవరిలో భీమ్లా నాయక్ ఒకటి ఉంది.. ఏప్రిల్ లో ఆచార్య, సర్కారు వారి పాట క్యూ కట్టాయి. వారితో పొత్తు ఎందుకని మార్చి నెలలో అయితే బావుంటుందని మేకర్స్ అబిప్రాయపడుతున్నారట. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. ఈసారి కూడా డౌటే అన్నట్లుగా అభిమానులు నిరాశకు గురి అవుతున్నారు. మరి మేకర్స్ ఏం ప్లాన్ చేశారో ఆ శివయ్యకే తెలియాలి అంటున్నారు అభిమానులు.
