Darshan D56: కన్నడ సూపర్ స్టార్ దర్శన్ పాన్ ఇండియా మూవీ షురూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Radhana Ram Debuting In Film Industry With Darshan D56 Film: ప్రముఖ నిర్మాత దివంగత రాము, సీనియర్ నటి మాలాశ్రీ కుమార్తె రాధనా రామ్ ‘చాలెంజింగ్ స్టార్’ దర్శన్‌తో కలిసి D56 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. బెంగళూరులోని శ్రీ రవిశంకర్ గురూజీ ఆశ్రమంలో శుక్రవారం వరమహాలక్ష్మి పర్వదినం సందర్భంగా ఈ చిత్రం ప్రారంభమైంది.
సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ రవిశంకర్ గురూజీ స్వయంగా హాజరై సినిమా తొలి షాట్‌కి కెమెరా స్విచాన్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తన రాక్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తెలుగు,కన్నడ , మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘రాబర్ట్’ ఫేమ్ తరుణ్ సుధీర రచన, దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాలలో కథానాయికగా నటించారు మాలాశ్రీ. అందం, అభినయంతో అశేష అభిమానులని సంపాదించుకున్న మాలాశ్రీ, లేడి ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ఆకట్టుకున్నారు. ఇప్పుడు మాలాశ్రీ కుమార్తె రాధనా రామ్ హీరోయిన్ గా పరిచయం కావడంతో సహజంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.
Also Read
- Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. 'ఉప్పెన' హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
- Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
ఈ సందర్భంగా మాలాశ్రీ మాట్లాడుతూ.. రాధనాకు శుభాకాంక్షలు. ఆమెకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు వుండాలి. రాక్‌లైన్ వెంకటేష్ నా సినిమాతో ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న సినిమాతో నా కూతురు నటిగా అరంగేట్రం చేస్తోంది. మంచి టీమ్‌తో ఆమె అరంగేట్రం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి నటి కావాలనుకుంది. ముంబైలో నటన, డ్యాన్స్ నేర్చుకుంది. ఆమె గత కొన్నేళ్లుగా చాలా కష్టపడి పని చేసింది . నా కూతురిగానే కాకుండ తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
రాధనా మాట్లాడుతూ..‘ఛాలెంజింగ్ స్టార్’తో తెరంగేట్రం చేయడం చాలా థ్రిల్‌గా వుంది. ‘ఈ సినిమాలో నటించే ఆఫర్ వచ్చినప్పుడు నేనే నమ్మలేకపోయాను. నటి కావాలనుకున్నాను. అందుకే, నన్ను నేను తెరపై ప్రెజెంట్ చేయడానికి గత కొన్నేళ్లుగా చాలా సన్నాహాలు చేసుకున్నాను. ప్రేక్షకులు నా తల్లిదండ్రులను ఆశీర్వదించినట్లే నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను’ అని కోరారు. D56 సోషల్ మెసేజ్ తో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమా షూటింగ్ అధిక భాగం బెంగుళూరులో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో జరగనుంది. సినిమాటోగ్రాఫర్ సుధాకర్ రాజ్, ఎడిటర్ కెఎం ప్రకాష్ సహా ‘రాబర్ట్’ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?