NTV Telugu Site icon

Radha Madhavam : రిలీజ్ కి రెడీ అవుతున్న రాధా మాధవం

Radha Madhavam

Radha Madhavam

Radha Madhavam Movie Poster Released: లవ్ స్టోరీలందు విలేజ్ లవ్ స్టోరీలు వేరయా అంటున్నారు నేటి దర్శక నిర్మాతలు. విలేజ్ వైబ్స్ ఉన్న లవ్ స్టోరీలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో మరో విలేజ్ లవ్ స్టోరీ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణ దేవి హీరో హీరోయిన్లుగా ‘రాధా మాధవం’ అనే సినిమాను దాసరి ఇస్సాకు తెరకెక్కిస్తున్నారు. గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రానికి వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా యూనిట్ రిలీజ్ కు దగ్గరవుతూ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ నెలలో మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోన్న సినిమా యూనిట్ ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచింది.

Dil Raju :‘యానిమల్’ లాంటి సినిమా చెప్పి మరీ తీస్తా !

ఇక ఈ సినిమా మూవీ ఫస్ట్ లుక్‌ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేయించగా ఇప్పుడు ఈ మూవీ పోస్టర్‌ను డీపీఎస్ ఇన్‌ఫో టెక్ మేనేజింగ్ డైరెక్టర్ డా.డీ.ఎస్.ఎన్.రాజు రిలీజ్ చేశారు. ఆ తరువాత ఆయన సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామ నగరి జ్యోతి, సురభి శ్యామల తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.