NTV Telugu Site icon

Raashi Khanna: ఆ హీరో పక్కన అప్పుడు సెకండే.. ఇప్పుడు కూడా సెకండేనా పాప.. ?

Raviteja

Raviteja

Raashi Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. మొదటి సినిమాతోనే ఏం సందేహం లేకుండా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరంగా ముద్ర వేసుకుంది. ఈ సినిమా తరువాత కుర్ర హీరోల సరసన నటించి మెప్పించినా కూడా అమ్మడికి అంత గుర్తింపు రాలేదు. ఇక అవకాశాల కోసం ముద్దుగా, బొద్దుగా ఉండే ఈ భామ సన్నబడి జీరో సైజ్ కు వచ్చింది. దీంతో బాలీవుడ్ లో అడుగుపెట్టి ఫర్జీ అనే వెబ్ సిరీస్ తో ఒక హిట్ ను అందుకుంది. ఇక అది కాకుండా అమ్మడి ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ లేదు. టాలీవుడ్, కోలీవుడ్ అంటూ మంచి హిట్ కోసం తిరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ భామకు ఒక బంపర్ ఆఫర్ వచ్చిందని టాక్ నడుస్తోంది. మాస్ మహారాజా రవితేజ, గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం RT4GM. ఇప్పటికే వీరి కాంబోలో డాన్ శ్రీను,బలుపు, క్రాక్ లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. దీంతో ఈ కాంబోలో వస్తున్న నాలుగో చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

Extra – Ordinary Man Teaser: కలిపి చదువు నాన్న.. చెత్త.. కొడుకు.. చెత్త నా కొడుకు

ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారట. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా కాబట్టి మెయిన్ హీరోయిన్ ను బాలీవుడ్ నుంచి పట్టుకురావాలని చూస్తున్నాడట గోపీచంద్ మలినేని. ఇక సెకండ్ హీరోయిన్ గా మాత్రం రాశీ ఖన్నాను ఖాయం చేశారని, కథ చెప్పడమే కాకుండా అడ్వాన్స్ కూడా అందించారని టాక్ నడుస్తోంది. రవితేజ సరసన రాశీ ఇప్పటికే బెంగాల్ టైగర్ చిత్రంలో నటించింది. ఆ సినిమాలో కూడా రాశీ సెకండ్ హీరోయిన్ గానే నటించింది. మెయిన్ లీడ్ తమన్నా చేసింది. అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో కూడా ఈ చిన్నది సెకండ్ లీడ్ ఎలా ఒప్పుకున్నది అనేది తెలియాలి. ఒకవేళ హిట్ కాంబో రిపీట్ కాబట్టి.. అమ్మడికి కూడా హిట్ వచ్చే ఛాన్స్ ఉందని అనుకోవచ్చని అభిమానులు అంటున్నారు. త్వరలోనే మేకర్స్ ఈ భామ పేరును అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. మరి రాశీ ఖన్నా ఆశలు ఈ సినిమాతోనైనా నెరవేరుతాయా.. ? లేదా.. ? చూడాలి.