Site icon NTV Telugu

ఓటీటీలో రాశి ఖన్నా సినిమా.. ఎప్పుడంటే?

బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘అంధదూన్’ రీసెంట్ గా తెలుగులో రీమేక్ అయినా సంగతి తెలిసిందే. నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈచిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈ సినిమా మలయాళంలో కూడా తెరకెక్కుతోంది. రవి కె.చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. కథానాయికగా రాశి ఖన్నా నటించింది. బాలీవుడ్ లో ‘టబు’ చేసిన పాత్రను మలయాళంలో మమతా మోహన్ దాస్ చేసింది. ఇక మమతా మోహన్ దాస్ ప్రియుడిగా ఉన్ని ముకుందన్ కనిపించనున్నాడు. అక్టోబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక రాశి ఖన్నా తెలుగులో ‘థ్యాంక్యూ’, ‘పక్కా కమర్షియల్’ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version