NTV Telugu Site icon

Raashi Khanna: అమ్మడు బాహుబలి చేసుంటే ఏ రేంజ్ లో ఉండేదో..

Raashi

Raashi

Raashi Khanna: సినిమా ఇండస్ట్రీ అన్నాకా.. ఒక కథ ఎంతోమంది దగ్గరకు వెళ్తుంది. ఒకసారి ఒకరిని అనుకున్నాకా కొన్ని కారణాల వలన ఆ ప్లేస్ లోకి ఇంకొకరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు మంచి మంచి హిట్ సినిమాలను వదిలేసుకున్నారు. ఒకవేళ ఆ సినిమాలు కనుక వారు చేసి ఉంటే ఈపాటికి వారి రేంజ్ వేరేలా ఉండేది. ప్రస్తుతం రాశీ ఖన్నా కూడా అలాగే అనుకుంటూ ఉంటుందేమో. ఎందుకంటే ఆమె రాజమౌళి దర్శకత్వంలో నటించే ఒక మంచి ఛాన్స్ ను పోగొట్టుకుంది. అవునా.. అంటే అవును.. నిజం ఈ విషయం ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ రాశీ. ఈ సినిమా తరువాత మంచి అవకాశాలు అయితే అందుకుంది కానీ, స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఈ మధ్యనే ఫర్జీ అనే వెబ్ సిరీస్ తో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ ఛాన్స్ ఎలా మిస్ అయ్యిందో చెప్పుకొచ్చింది.

Sai Pallavi: అరేయ్.. మీకసలు బుద్దుందా.. ఏది చెప్తే అది నమ్మేయడమేనా

” నా మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే సినిమా కన్నా ముందే నేను బాహుబలి సినిమాలోని తమన్నా పాత్రకు ఆడిషన్ కు వెళ్లాను. అప్పుడు నన్ను రాజమౌళి గారు చూసి.. మరీ క్యూట్ గా ఉన్నావ్. నీకు లవ్ స్టోరీ బాగా సెట్ అవుతుంది.. నాకు తెల్సిన ఒక డైరెక్టర్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. నేను అతనికి చెప్తాను.. స్టోరీ విను తప్పకుండా నీకు నచ్చుతుంది అని చెప్పారు. అలా నేను అవంతిక పాత్ర కోసం వెళ్తే.. నాకు ఊహలు గుసగుస లాడే సినిమా దొరికింది ” అని చెప్పుకొచ్చింది. ఒకవేళ రాజమౌళి ఒప్పుకొని తమన్నా ప్లేస్ లో రాశీ ఖన్నా కనుక నటించి ఉంటే ..అమ్మడి రేంజ్ ఇప్పుడు వేరేలా ఉండేది. బాహుబలి 1, 2 సినిమాల్లో నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా సెటిల్ అయిపోయేది. అందుకే అంటారు ఎవరి కోసం రాసిపెట్టి ఉన్న పాత్ర వారికోసమే ఎదురుచూస్తోంది అని.. తమ్ము బేబీ కోసమే అవంతిక పుట్టిందని చెప్పొచ్చు. ఇకపోతే ప్రస్తుతం రాశ.. ఫర్జీ సెకండ్ సీజన్ కోసం ఎదురుచూస్తోంది.

Show comments