Site icon NTV Telugu

Raadhika Sarathkumar: అనిమల్ సినిమా.. ఛీఛీ.. వాంతి వచ్చింది

Animal

Animal

Raadhika Sarathkumar: అనిమల్ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే. రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అనిమల్. ఈ సినిమా గత నెల రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలామంది నెగెటివ్ గా మాట్లాడారు. ఎక్కువ వైలెన్స్ ఉందని, ఆ బూతులు.. ఇవన్నీ చాలామందికి నచ్చలేదు. అయితే మరికొంతమందికి సినిమా నచ్చింది.. రియలిస్టిక్ గా ఉందని చెప్పుకొచ్చారు. బాక్సాఫీస్ వద్ద అనిమల్ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 915 కోట్లకుపైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో 2023 సంవత్సరంలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా అనిమల్ నిలిచింది. అనేక రికార్డులను బ్రేక్ చేసింది. సెలబ్రిటీలు సైతం సినిమాపై మంచి రివ్యూలు ఇచ్చారు. అయితే తాజాగా సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ఈ సినిమాపై ఆసక్తికరమైన ట్వీట్ చేసింది.

“ఎవరైనా ఆ సినిమా చూశాక అసహ్యం కలిగిందా ? నాకు ఆ మూవీపై వాంతి చేయాలని ఉంది. చాలా కోపంగా అనిపిస్తోంది” అని చెప్పుకొచ్చింది. అయితే సినిమా పేరు మాత్రం మెన్షన్ చేయలేదు. అయినా కూడా నెటిజన్స్ ఆ సినిమా అనిమల్ అని చెప్పేస్తున్నారు. ఇక ఈ ట్వీట్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఒక నటిగా మీరు ఇలా మాట్లాడకూడదు.. జనరేషన్ మారేకొద్దీ సినిమాలు మారతాయి. వాటిని యాక్సెప్ట్ చేయడం, చేయకపోవడం మీ ఇష్టం కానీ, ఇలా ఒక సినిమా గురించి మాట్లాడడం పద్దతికాదు అని కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version