ఎస్ఆర్ ఎడిటర్ దర్శకుడిగా పరిచయం అవుతూ.. నితిన్ హీరోగా ‘మాచెర్ల నియోజకవర్గం’ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే! ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా, చాలాకాలం నుంచి చిత్రీకరణ దశలోనే ఉంది. ఇప్పుడు విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ఒక్కొక్కటిగా క్రేజీ అప్డేట్స్ ఇస్తోంది. లేటెస్ట్‌గా ‘రా రా రెడ్డి’ మాస్ నంబర్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట విన్న మొదటిసారే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ కనెక్ట్ అవ్వడం ఖాయం. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే, ఈ పాట అంత బాగుంది.
రంగురంగుల సెటప్ నేపథ్యంలో మొదట్లో కాస్త బూతు డైలాగులతో ప్రారంభమయ్యే ఈ సాంగ్.. ‘మాచర్ల సెంటర్‌లో మాపటేళ్ల నేనొస్తే’ అంటూ మాస్ బీట్‌తో సాగుతుంది. లిప్సిక పాడిన ఈ పాటకు మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చాడు. మొదట్నుంచి చివరిదాకా అతడు అందించిన మాస్ బీట్స్‌కి స్టెప్పులు వేయకుండా ఉండలేరు. లిరిక్స్ కూడా పూర్తి మాసీగా ఉన్నాయి. ముఖ్యంగా.. చివర్లో వచ్చే ‘రాను రానంటూనే చిన్నదో’ అంటూ వచ్చే బీట్ ఏదైతే ఉందో, అక్కడ గూస్‌బంప్స్ రావడం గ్యారెంటీ. ‘జయం’ నాటి రోజులు గుర్తుకొచ్చేస్తాయి. ఆ లిరిక్స్‌కి తగ్గట్టు మాస్ బీట్ అందించిన మహతిని మెచ్చుకోకుండా ఉండలేం!
ఇక ఈ పాటలో అంజలి సూపర్ హాట్‌గా కనిపించడమే కాదు.. మాస్ స్టెప్పులతో అదరహో అనిపించింది. నితిన్ కూడా దుమ్ముదులిపేశాడు. సెటప్ కూడా కలర్‌ఫుల్‌గా అదిరింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ మాస్ సాంగ్ ఈ చిత్రానికే హైలైట్‌గా నిలవడం ఖాయం. కాగా.. నితిన్ సరసన ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరీన్ తెరిసాలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.