Site icon NTV Telugu

ఫూల్స్ డేన జనం ముందుకు మాధవన్ ‘రాకెట్రీ’

ప్రముఖ నటుడు మాధవన్ తొలిసారి మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన సినిమా ‘రాకెట్రీ’. భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో విశేష కృషి చేసిన సైంటిస్ట్ నంబి నారాయణ్‌ బయోగ్రఫీ ఇది. ఇప్పటికే తొలికాపీ సిద్దం చేసుకున్న ఈ మూవీ ట్రైలర్ ను చూసి ప్రధాని నరేంద్రమోదీ మాధవన్, నంబి నారాయణ్ లను ప్రత్యేకంగా అభినందించారు. మాధవన్ నంబి నారాయణ్ గా నటించిన ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్ 1న ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది.

కెరీర్ ప్రారంభంలో ‘సఖి, చెలి’ వంటి చిత్రాలలో లవర్ బోయ్ గా నటించి మెప్పించిన మాధవన్, గత కొంతకాలంగా ప్రతినాయుడి పాత్రలూ చేస్తున్నాడు. తెలుగులో ‘సవ్యసాచి, నిశ్శబ్దం’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించాడు. అయితే… వాటన్నింటికీ భిన్నమైన పాత్రను ‘రాకెట్రీ’లో ఆయన చేశాడు. ఇస్రో సైంటిస్ట్ అయిన నంబి నారాయణ్ పై ఒకానొక సమయంలో దేశద్రోహం కేసు పెట్టి యాభై రోజుల పాటు జైల్లో పెట్టారు. ఆ తర్వాత కోర్టు ఆ కేసును కొట్టేసింది. దేశం కోసం పనిచేసే ఓ సైంటిస్ట్ కొందరి కుట్ర కారణంగా తన జీవిత కాలంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడన్న అంశాలనే మాధవన్ తన ‘రాకెట్రీ’లో చూపించారు. మరి వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version