Site icon NTV Telugu

PVT 04: అప్పుడు ‘విజయ్ సేతుపతి’ ఇప్పుడు ‘జోజు జార్జ్’…

Pvt 04

Pvt 04

మెగా మేనల్లుడిగా, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ‘పంజా వైష్ణవ్ తేజ్’. మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే సాలిడ్ డెబ్యు ఇచ్చిన వైష్ణవ్ తేజ్, ఒక ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బుచ్చిబాబు సన డైరెక్ట్ చేసిన ఉప్పెన సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్పెషల్ రోల్ ప్లే చేశాడు. ఈ మూవీ అంత పెద్ద హిట్ అయ్యింది అంటే దానికి సేతుపతి యాక్టింగ్ కూడా కీ రోల్ ప్లే చేసింది. సేతుపతి యాక్టింగ్ ని చూడడానికి చాలా మంది తెలుగు ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చారు. ఉప్పెన సినిమాలో సేతుపతి లాగే వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమాలో కూడా ఒక టాలెంటెడ్ యాక్టర్ కనిపించబోతున్నాడు.

నేషనల్ అవార్డ్ విన్నర్, మలయాళ నటుడు ‘జోజు జార్జ్’ వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాలో ‘చెంగారెడ్డి’ పాత్రలో నటిస్తున్నాడు. మోస్ట్ టాలెంటెడ్ మలయాళ ఆర్టిస్టుల్లో ఒకడైన జోజు జార్జ్ ఇటివలే ‘ఇరట్ట’ సినిమాలో సూపర్బ్ యాక్టింగ్ చేశాడు. జోజు జార్జ్ లాంటి యాక్టర్ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం ఏ యాక్టర్ ని అయినా ఛాలెంజింగ్ విషయమే. అయితే ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్ కి, సేతుపతి కాంబినేషన్ సీన్స్ ఎక్కువగా పడలేదు. ఈసారి చేసేది పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా కాబట్టి వైష్ణవ్ తేజ్ కి, జోజు జార్జ్ కి మధ్య సాలిడ్ సీన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఒక యాక్టర్ కి ఇది తనలోని నటుడిని కొత్తగా ప్రెజెంట్ చేసుకునే ఒక మంచి అవకాశం. మరి ఈ ఛాన్స్ ని వైష్ణవ్ తేజ్ ఎంతవరకూ నిలబెట్టుకుంటాడో చూడాలి.

Exit mobile version