NTV Telugu Site icon

PVR INOX: సౌత్ లో రచ్చ రేపే ఆఫర్ తో దిగుతున్న పీవీఆర్.. వింటే సినిమాలకి వెళ్లకుండా ఆగలేరు!

Theatres

Theatres

PVR INOX Passport Offer to Launch in South Soon: ఈ రోజుల్లో థియేటర్లకి వెళ్లి సినిమా చూడడం ఖరీదైన విషయం. సినిమా పిచ్చోళ్లు తప్ప మిగతా వాళ్ళు అందరూ లగ్జరీగా భావిస్తున్న ఈ విషయంలో ఒక కుటుంబం అంతా థియేటర్‌లో మూవీ చూడాలంటే కష్టమే. ఈ దెబ్బకి భయపడే ఎక్కువ మంది ఓటీటీ వైపు మక్కువ చూపిస్తూ ఓటీటీలో ఓ నెల ఆగితే చూడచ్చు అని ప్రేక్షకులు రిలాక్స్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సినిమా థియేటర్ల చైన్ పీవీఆర్‌ ఐనాక్స్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల్ని మూవీ థియేటర్లకు రప్పించడానికి సరికొత్త ఆఫర్ ను తీసుకురానుంది. ప్రస్తుతం నార్త్‌ ప్రేక్షకులకు పీవీఆర్‌ మూవీ పాస్‌ అనే ఒక విధానం అందుబాటులో ఉంది. ఈ పాస్‌ను సౌత్‌లో కూడా పరిచయం చేసేందుకు సిద్ధం అయిన సంస్థ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. నిజానికి ఈ పాస్‌ ధర 699 రూపాయలు ఉంటుంది. నెలకు 10 సినిమాలు చూడవచ్చు కానీ అవి సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది.

Orey Trending: రేయ్ ఏంట్రా ఇది.. మహేష్ పాట ప్రోమో రిలీజ్.. ట్రేండింగ్ లో ఒరేయ్!

పీవీఆర్‌ మూవీ పాస్‌కు సంబంధించి ఇప్పటికే ప్రీ రిజిస్ట్రేషన్‌లు మొదలు కాగా ఈ పాస్‌లు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై క్లారిటీ లేదు. సంక్రాంతి సీజన్ అయ్యాక రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మామూలుగా పీవీఆర్‌ ఐనాక్స్‌ వంటి వాటిల్లో సినిమాలు చూడాలంటే ఒక్కొక్కరికి టికెట్ కోసమే మినిమం 200 దాకా ఖర్చు అవుతుంది. అంటే పది సినిమాలు చూడాలంటె 2000 రూపాయలు ఖర్చు చేయాలి. కానీ, పీవీఆర్‌ మూవీ పాస్‌ తో 700 రూపాయలకే 2000 రూపాయల విలువైన సినిమాలను చూడొచ్చు. కానీ జనాలు వీకెండ్స్ లో థియేటర్లకు క్యూ కడతారు, వీక్ డేస్ లో జనం ఉండరు. కాబట్టి థియేటర్లు ఫిల్ చేసుకోవడానికి ఇలా ప్లాన్ చేసిందని అనుకోవచ్చు.
పీవీఆర్‌ ఐనాక్స్‌ మూవీ పాస్‌ల కోసం.. https://passport.pvrinox.com/లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

Show comments