NTV Telugu Site icon

Salaar VS Dunki: సలార్ vs డుంకీ వివాదం.. స్పందించిన పీవీఆర్ సీఈవో

Salaar Vs Dunki

Salaar Vs Dunki

PVR Inox CEO Responds on Salaar VS Dunki Issue: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ డుంకీ సినిమా ఒకరోజు వ్యవధితో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ డుంకీ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని డిసెంబర్ 21వ తేదీ రిలీజ్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమాని ఒక రోజు గ్యాప్ తో 22వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అయితే షారుక్ ఖాన్ తో పోలిస్తే ప్రభాస్ కి నార్త్ లో మార్కెట్ పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో పూర్తిగా సలార్ సినిమాను డామినేట్ చేసేందుకు ఒక నిర్ణయం తీసుకుని నేషనల్ థియేటర్ చైన్లను బ్లాక్ చేసే పనిలో పడింది డుంకీ టీం. ఆయా సంస్థల ఆధ్వర్యంలో నడిచే సింగిల్ స్క్రీన్స్లో పూర్తిగా డుంకీ సినిమా ఆడే లాగా వారి మీద ప్రజర్ తీసుకొచ్చారు.. ఈ క్రమంలో సౌత్ మొత్తం మీద పివిఆర్ ఐనాక్స్ అదేవిధంగా మిరాజ్ సంస్థలకు చెందిన థియేటర్లలో సలార్ ఆడించేది లేదంటూ మేకర్స్ ఒక నిర్ణయానికి వచ్చారు.

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌ సూసైడ్ చేసుకుంటే వాళ్ళే కారణం.. సీపీఐ నారాయణ సంచలన వీడియో విడుదల

ఈ నేపథ్యంలో పివిఆర్ సంస్థ సీఈవో చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా నిర్మాతలకు తమకు మధ్య ఉన్న మేటర్ బయటకు రానివ్వకుండా చూసుకుంటాం కానీ ఈ విషయంలో అసలు తమ ఉద్దేశం ఏంటో బయటకు చెప్పాలని అనిపిస్తుందని ఆయన రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో మీడియాలో పివిఆర్ ఐనాక్స్ సంస్థ ఈ రెండు సినిమాల విషయంలో వ్యాపారం సరిగా చేయడం లేదని, తప్పుడు ఉద్దేశంతో ముందుకు వెళుతుందనే వార్తలు చూశానని చెప్పుకొచ్చారు. అయితే తమకు అందరూ నిర్మాతలు ఒక్కటేనని ఒకరి మీద ఎక్కువ ప్రేమ ఉండడం లాంటివి ఏమీ ఉండవని చెప్పుకొచ్చారు. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్న సమయంలో కొన్ని కమర్షియల్ విషయాలలో అన్ని అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు, అయితే ఇదేమీ మొదటిసారి కాదు అలా అని చివరి సారి కూడా కాదు త్వరలోనే ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, ఈలోపు మీరు అనవసరంగా కొత్త కొత్త స్టోరీలు పుట్టించవద్దు అంటూ ఆయన రాసుకొచ్చాడు