Pushpa Reference in The Family Star Movie: పరశురాం పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమా తెరకెక్కింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీత గోవిందం సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే మొదటి ఆట నుంచి సినిమాకి కాస్త మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. సినిమా అద్భుతంగా ఉందని కొంతమంది కామెంట్ చేస్తుంటే రొటీన్ సినిమా అని, అసలు ఇప్పుడు చేయాల్సిన కథ కాదని మరి కొంతమంది అంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా రిఫరెన్స్ వాడడం హాట్ టాపిక్ అవుతుంది.
Harish Rao: మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసింది..
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బామ్మగా మరాఠీ నటి రోహిణి నటించారు. ఆమె గతంలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు, వెంకటేష్ ఇద్దరికీ బామ్మ పాత్రలో నటించారు. ఆ తర్వాత చాలా కాలానికి ఆమె మళ్ళీ తెలుగు తెరమీద కనిపించారు. అయితే ఆమె చేత పుష్ప మేనరిజం చేయించారు దర్శకుడు. ఒకానొక సందర్భంలో ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని బామ్మ ఒక షాపింగ్ మాల్ కి వెళుతుంది. ఆ సమయంలో ఆమె ఈ పుష్పం మేనరిజం చేసి చూపించడం హార్ట్ టాపిక్ అవుతుంది. ఇక ఈ సీన్ చూసి పుష్ప రాజు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవాలి అంటూ అల్లు అర్జున్ అభిమానులు అయితే కామెంట్ చేస్తున్నారు.