Site icon NTV Telugu

“పుష్ప” ఈవెంట్ ఆపేస్తాం… బన్నీ ఫ్యాన్స్ కు వార్నింగ్

Pushpa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప : ది రైజ్ 1” ప్రీ-రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 12న హైదరాబాద్‌లో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. మేకర్స్ ఈ విషయం ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆతృతగా ఈ వేడుక కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్లంతా ఎదురు చూసిన సమయం ఈరోజు రానే రావడంతో వారి ఉత్సాహానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ఈవెంట్ నిర్వాహకులు. ఈరోజు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారీగా బన్నీ ఫ్యాన్స్ రావడంతో తొక్కిసలాట జరుగుతోంది. జనాలు బారికేడ్లు దాటుకుని మరీ దూసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.

Read Also : “పుష్ప” వేడుక వేదిక వద్ద ఉద్రిక్తత

ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ పదేళ్ల బాలుడికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారట. ఈవెంట్ మేకర్స్ బన్నీ ఫ్యాన్స్ కాస్త శాంతించాలని, పోలీసులకు, వేడుక సవ్యంగా జరగడానికి సహకరించాలని పదేపదే కోరుతున్నారు. అయినప్పటికీ వాళ్ళు ‘తగ్గేదే లే’ అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో నిర్వాహకులు విసుగు చెంది, వాళ్ళు సహకరించకపోతే కార్యక్రమాన్ని ఆపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దాదాపు రెండేళ్ల తరువాత జరుగుతున్న అల్లు అర్జున్ వేడుక, ఆయన అభిమానుల కోసం చాలా కంటెంట్ ప్లాన్ చేశామని, బారికేడ్లు దాటాలని చేసే ప్రయత్నాల్లో కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.”పుష్ప” ఈవెంట్ ఆపేస్తాం… బన్నీ ఫ్యాన్స్ కు హెచ్చరించారు.

Exit mobile version