NTV Telugu Site icon

Pushpa 2: అల్లు అర్జున్ చీర కట్టడం వెనుక ఇంత కథ ఉందా.. సుక్కు.. నువ్వు మాములోడివి కాదు సామీ..?

Arjun

Arjun

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే సుకుమార్.. బన్నీని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అయితే సోషల్ మీడియాను షేక్ చేసిందని చెప్పాలి. ఒక స్టార్ హీరో అయ్యి ఉండి ఇలా చీరకట్టి, కాళికా మాత రూపంలో దర్శనమిస్తాడు అని ఎవ్వరు ఊహించలేకపోయారు. మొదటి నుంచి చెప్పుకొస్తున్నట్లే పాత్ర కోసం బన్నీ ఏదైనా చేస్తాడు. ఇప్పుడు కూడా కథలో భాగంగానే ఈ గెటప్ ను వేసినట్లు తెలుస్తోంది. ఈ కాళికా మాత గెటప్ వెనుక చాలా పెద్ద కథనే ఉందట. ప్రస్తుతం ఈ పోస్టర్ వెనుక ఉన్న కథను నెటిజన్లు డీకోడ్ చేస్తున్నారు.

Allu Arjun- Sukumar: ఈ కాంబో ఉంటుంది బాసూ.. వేరే లెవెల్ అంతే

పూర్వ కాలంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లో పాలెగాండ్ల రాజ్యం నడుస్తూ ఉండేది. వారు ఏది చెప్తే అదే రాజ్యం. ఇక మహిళలపై వారు చేసే అత్యాచారాలకు లెక్కే ఉండేది కాదట. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా నచ్చిన అమ్మాయిని బలవంతం చేసే చంపేసేవారట. దీంతో అక్కడ ఉన్న గ్రామస్థులు తమ కష్టాలను చెప్పుకొని ప్రార్థిస్తే గంగమ్మ తల్లి అవతరించిందట. ఆమెకు భయపడి పాలెగాండ్లు అంతా అడవిలోకి పారిపోయి దాక్కొనేవారట. ఇక వారిని బయటకు తీసుకురావడానికి మగవారే ఆడవారిగా మారి చీరకట్టుకొని.. అడవిలోకి వెళ్లి వారిని బయటకు తీసుకొచ్చేవారట. వారిని గంగమ్మ సంహరించేదని చెప్పుకొస్తారు. అలా గంగమ్మ తల్లి అవతారించాక ఆ గ్రామాలలో అత్యాచారం ఆగిపోయాయట. ఇక ఈ కథ ఆధారంగానే పుష్ప 2 ఉండబోతుందని సమాచారం. అడవిలో ఉన్న విలన్స్ ను చంపడానికి పుష్ప .. కాళికా మాతలా మారి దుష్ట సంహారం చేస్తాడట. ఇదే గెటప్ లో క్లైమాక్స్ ఫైట్ ను సెట్ చేశాడట సుక్కు. ఇక ఈ డీకోడ్ లో నిజం ఎంత ఉన్నదో తెలియదు కానీ, ఇదే కనుక నిజమైతే పుష్ప 2 క్లైమాక్స్ నభూతో నభవిష్యత్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాను సుక్కు ఏ విధంగా ప్లాన్ చేశాడో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Show comments