NTV Telugu Site icon

Pushpa Jagadeesh: బ్రేకింగ్.. యువతి ఆత్మహత్య.. పుష్ప నటుడు అరెస్ట్

Keshava

Keshava

Pushpa Jagadeesh:పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు ఎంత పేరు వచ్చిందో.. పుష్ప స్నేహితుడు కేశవగా నటించిన జగదీశ్ కు కూడా అంతే పేరు వచ్చింది. ఈ సినిమా తరువాత అతడి రేంజే మారిపోయింది. పుష్ప విజయంతో అంత పేరు తెచ్చుకొని సత్తిగాని రెండెకరాలు అనే సిరీస్ లో హీరోగా కూడా నటించాడు జగదీశ్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జగదీశ్.. ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసాడని అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు విషయంలోకి వెళ్తే.. జగదీశ్.. కెరీర్ మొదట్లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ను తెరకెక్కించాడు.

ఇక ఆ సమయంలోనే ఒక యువతి, జగదీశ్ కు పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది. ఆ తరువాత జగదీశ్ కు పుష్ప అవకాశం రావడం, పేరు రావడం జరిగాయి. ఇక వీరి మధ్య పెళ్లి గురించి గొడవ జరిగిందో.. లేదో తెలియదు కానీ, ఐదు రోజుల క్రితం ఆ యువతి ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఇక యువతి మరణానికి కారణం జగదీశ్ అని, తన కూతురిని నమ్మించి మోసం చేశాడని యువతి తండ్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు జగదీశ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Show comments