NTV Telugu Site icon

Pushpa 2 : సుకుమార్- బన్నీ మధ్య ఏం జరుగుతోంది?

Sukumar Allu Arjun

Sukumar Allu Arjun

Pushpa 2 What is Happening Between Allu Arjun and Sukumar: పుష్ప టు సినిమాకు సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ సినిమా సీక్వెల్ ని నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారు. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో ఈ రెండో భాగానికి సుకుమార్ సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆగస్టు నెలలో రావాల్సిన ఈ సినిమా ఒకసారి వాయిదా పడి డిసెంబర్ డేట్ అనౌన్స్ చేశారు. అయితే ఆగస్టు నెలలో సినిమాను ఎలా అయినా రిలీజ్ చేయించాలని హీరో సహాయం నిర్మాతలు ప్రయత్నించారు. కానీ సుకుమార్ పంతం నెగ్గి డిసెంబర్ కి వాయిదా వేయబడింది. ఇంకా ఈ సినిమాకి 30 రోజుల రెగ్యులర్ షూటింగ్ పెండింగ్ ఉంది. అయితే ప్రస్తుతానికి షూటింగ్ వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. దీనికి కారణం సుకుమార్ కి జ్వరం వచ్చింది అని ఒక టాక్. కాదు రెగ్యులర్ షూటింగ్ బ్రేక్ అని మరొక టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

RK Roja: పారిశుద్ధ్య కార్మికులతో రోజా షాకింగ్ ప్రవర్తన..వీడియో వైరల్

సరిగ్గా ఇప్పుడే ఆయన అమెరికా వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే షూట్ డిలే అవుతున్న నేపథ్యంలో హీరో అప్సెట్ అయ్యాడని, వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఏకంగా మూడు యూనిట్లు ఒకేసారి రంగంలోకి దింపి షూటింగ్ పూర్తి చేయాలని ఆయన దర్శకుడికి సూచించినా దర్శకుడు మాత్రం అలా తొందర పడవద్దు అని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దర్శకుడికి హీరోకి మధ్య నిర్మాతలు అయితే నలిగిపోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పుష్ప 2 లేట్ కావడం వల్లే అట్లీతో అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా మిస్సయిందని చెబుతున్నారు. ఆగస్టు నెలాఖరు లోపు సినిమా షూటింగ్ పూర్తి చేస్తే ఆ తరువాత పెద్ద సినిమా కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కి మరో రెండు నెలలు పట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అదిగాక సుకుమార్ లాంటి పర్ఫెక్షనిస్ట్ దర్శకుడు అయితే మరింత సమయం పోస్ట్ ప్రొడక్షన్ మీద వెచ్చిస్తారు కూడా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే సుకుమార్ అమెరికా వెళ్లడంతో ఎప్పుడు తిరిగి వస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నట్లుగా చెబుతున్నారు.

Show comments