Pushpa 2: పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్లుగా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ ను వెండితెరపై చూసి చాలా రోజులే అయిపోతుంది. ఇక సుకుమార్ అయితే.. పుష్ప ను మించి పుష్ప 2 ఉండాలని ఒక శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతున్నాడు. ఇప్పటికే ఈచిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్.. ఆ విషయాన్నీ చెప్పకనే చెప్పుకొచ్చాయి. ఇక ఆగస్టు 15 కు పుష్ప 2 ను రిలీజ్ చేయాలనీ మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే.. షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. షూటింగ్ ను త్వరగా పూర్తీ చేయడానికి షూట్ రెండు యూనిట్స్ పెట్టి, ప్రతి రోజు ఓవర్ టైం కూడా చేస్తున్నారట.
ఆగస్టు 15 చాలా మంచి డేట్. ఆరోజు మిస్ అయితే..అలాంటి డేట్ దొరకడం కష్టం. ఇప్పటికే ఆ డేట్ ను లాక్ చేసి పెట్టారు. అప్పటిలోగా షూటింగ్ ఫినిష్ చేసి.. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను మొదలుపెట్టకపోతే.. ప్రమోషన్స్ కు టైమ్ దొరకదు. అంతేకాకుండా సినిమా ఇంకా పూర్తి కాకపోతే వేరేవాళ్లు వచ్చి డేట్ ను లాక్ చేసుకొనే ప్రమాదం ఉంది. అందుకే ఎలాగైనా షూటింగ్ ను పూర్తిచేయడానికి సుకుమార్ ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ కూడా నిద్రాహారాలు మాని..పుష్ప 2 కోసం కష్టపడుతున్నారట. ఈ సినిమాపై అభిమానులు ఏ రేంజ్ లో అంచనాలు పెట్ట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలను మించి సుకుమార్.. పుష్ప 2 ను తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమాతో సుకుమార్.. ప్రేక్షకుల అంచనాలను నిలబెడతాడా.. ? అల్లు అర్జున్ మరో జాతీయ అవార్డు ను అందుకుంటాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.
