స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన మూవీ ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ పార్ట్ 1 ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చే రేంజులో హిట్ అయ్యింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో రూపొందిన పుష్ప మూవీ పార్ట్ 2 కోసం పాన్ ఇండియా సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పార్ట్ 1లో ఫాహద్ ఫాజిల్ కి అల్లు అర్జున్ కి మధ్య సాలిడ్ ట్రాక్ వేసిన సుకుమార్, పార్ట్ 2కి అవసరమైన బేస్ ని సిద్ధం చేశాడు. షెకావత్ సర్ కి పుష్ప రాజ్ కి మధ్య పార్ట్ 2లో ఎర్ర చందనం వార్ ఎలా ఉంటుందో? ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారు అనేది ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. ఒక్కటి తక్కువ అయ్యింది పుష్ప అంటూ ఫాహద్, అల్లు అర్జున్ ని ఎలా కంట్రోల్ చేస్తాడు అనేది పుష్ప 2 సినిమాకే మెయిన్ పాయింట్ కాబట్టి ఈ హీరో-విలన్ ల మధ్య వచ్చే సీన్స్ స్పెషల్ గా ఉంటాయని అనడంలో సందేహం లేదు.
ఇప్పటివరకూ ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా ఇవ్వని పుష్ప 2 సినిమా షూటింగ్ హైదరాబాద్ లో కంప్లీట్ అయ్యింది. రష్మిక, అల్లు అర్జున్, ఫాహద్ లు పాల్గొన్న ఈ షెడ్యూల్ ని పూర్తి చేసిన సుకుమార్, నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటివరకూ పుష్ప 2కి సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చెయ్యకుండా సీక్రెట్ గా షూటింగ్ చేస్తున్న సుకుమార్, అల్లు అర్జున్ పుట్టిన రోజున పుష్ప 2 ఫస్ట్ లుక్ తో పాటు, ఒక గ్లిమ్ప్స్ ని కూడా రిలీజ్ చెయ్యబోతున్నాడని సమాచారం. మరి పాన్ ఇండియా ప్రమోషన్స్ కి ఆ గ్లిమ్ప్స్ ఏ రేంజ్ స్టార్ట్ ఇస్తుందో చూడాలి.