స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చింది ‘పుష్ప ది రైజ్’ సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ 350 కోట్లు రాబట్టి పాన్ ఇండియా హిట్ అయ్యింది. ఫిల్మ్ సెలబ్రిటీస్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెటర్స్ వరకూ ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని ఫాలో అయ్యారు అంటే పుష్ప ది రైజ్ రాబట్టిన క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు పాన్ ఇండియా మొత్తంలో మోస్ట్ అవైటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఏకైక సినిమా ‘పుష్ప ది రూల్’ మాత్రమే. అప్డేట్ కోసం ఇన్ని రోజులుగా ఎదురు చూసిన ఫాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ సుకుమార్ అండ్ టీం అల్లు అర్జున్ బర్త్ స్పెషల్ గా ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈరోజు సాయంతం 4:05కి రిలీజ్ కానున్న ఈ వీడియో కోసం పుష్పరాజ్ ఫాన్స్ అందరూ డెస్పరేట్ గా వెయిట్ చేస్తున్నారు.
ఎలాంటి డిలే లేకుండా చెప్పిన టైంకి వీడియో రిలీజ్ చెయ్యబోతున్నాం అనే కన్ఫర్మేషన్ ఇస్తూ మేకర్స్ సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేశారు. #WhereisPushpa ? అంటూ బయటకి రాబోతున్న ఈ వీడియోకి సంబంధించిన వర్క్స్ ని చిత్ర యూనిట్ కంప్లీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోనే మేకర్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇందులో సుకుమార్ ముందు ఉన్న స్క్రీన్ పైన మొత్తం ఫైర్ ఉంది. బాస్, రెండు కార్లు, ఒక జీపుని కూడా బ్లాస్ట్ చేసినట్లు ఉన్నారు. ఫ్రేమ్ అంతా ఫైర్ తో నిండి ఉండడం చూస్తుంటే సుకుమార్ ప్రమోషనల్ వీడియోతోనే భారి హైప్ ని క్రియేట్ చెయ్యడానికి రెడీ అవుతున్నట్లు ఉన్నాడు. మరి బన్నీ బర్త్ డే స్పెషల్ వీడియో ఏ రేంజులో ఉండబోతుందో తెలియాలి అంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చెయ్యాల్సిందే.
The fire is set to spread all over the nation 🔥#WhereisPushpa ?
– https://t.co/KrNCY8EGQFRevealing today at 4.05 PM 🔥#PushpaTheRule ❤️🔥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @PushpaMovie pic.twitter.com/pXJgi4G3aF— Mythri Movie Makers (@MythriOfficial) April 7, 2023