NTV Telugu Site icon

Puri Jagannadh: మరో బాంబ్ పేల్చిన పూరి.. ప్రేమికులు రెండు సార్లు అది చేసుకోండి

Puri

Puri

Puri Jagannadh: లైగర్ సినిమా తరువాత పూరి జగన్నాథ్ కొద్దిగా స్లో అయిన విషయం తెల్సిందే. వరుస వివాదాల మధ్య నలిగిపోయిన పూరి ఈ మధ్యనే కొద్దికొద్దిగా బయటకు వస్తున్నాడు. మళ్లీ అభిమానులతో ముచ్చటిస్తున్నాడు. తనకు నచ్చిన విషయాలు, తన అనుభవాలను పూరి మ్యూజింగ్స్ ద్వారా అభిమానులతో పంచుకుంటాడు. ఇక తాజాగా లవ్ డ్రగ్ పేరుతో పూరి రిలీజ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. లవ్ అనేది ఒక డ్రగ్ అని, అందులో నీతి, నిజాయితీ, ప్రేమ, తొక్కా తోటకూర ఏమి లేవని చెప్పుకొచ్చాడు. నా ప్రియుడు గాఢంగా ప్రేమిస్తున్నాడు.. నా లవర్ నన్ను పెళ్లి చేసుకుంటుంది అని చెప్పుకోవడమే తప్ప అందులో నిజం లేదని ఆ ఫీలింగ్ అంతా ఒక కెమికల్ రియాక్షన్ అని బాంబ్ పేల్చాడు. అంతేకాకుండా అందుకు ప్రూఫ్స్ కూడా చెప్పుకొచ్చాడు.

డాక్టర్ హెలెన్ ఫిషర్ అని ఒక ఆమె.. ప్రేమ గురించి అధ్యయనం చేసి కొన్ని పుస్తకాలు రాసిందని, అతనే ఎందుకు..? ఆమె ఎందుకు..? ప్రేమ ఎంత గొప్పది అని రీసెర్చ్ కూడా చేసిందని చెప్పుకొచ్చాడు. 2500 మంది స్టూడెంట్స్ బ్రెయిన్ ను ఆమె స్కాన్ చేసి చివరికి ప్రేమ లేదు దోమ లేదు.. ఇదంతా కెమికల్స్ మాయ అని తేల్చి చెప్పింది. లవ్ కూడా ఒక డ్రగ్ అని తేలింది.. ప్రేమించినప్పుడు హ్యాపీ కెమికల్స్ అన్ని రిలీజ్ అవుతాయి. ముందు పెట్టుకున్నప్పుడు ఇంకొక ముద్దు.. ఇంకొక ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అదంతా కెమికల్ మాయ.. మీ ప్రేమ కాదు.. ఆ లవ్ డ్రగ్ లో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు.. ఎలాంటి ప్రామిస్ లు చేయవద్దు.. మీ లవర్ కోసం పేరెంట్స్ ను వదిలి బయటికి వెళ్లదలు, ప్రాణాలు ఇస్తాను అనడాలు చేయకండి. అందుకే మీ లవర్ కు ప్రామిస్ చేసేముందు రెండు సార్లు స్వయంతృప్తి పొందేలా హస్తప్రయోగం చేసుకోండి. అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా.. ఆ పని చేసిన తరువాత ఎలాంటి నిర్ణయమైనా తీసుకోండి. ఎందుకంటే అలా చేసుకున్నప్పుడు కెమికల్స్ చల్లబడతాయి.. మీరు కామ్ అవుతారు. నిర్ణయాలు మంచిగా వస్తాయి. మీ జీవితాలు బాగుపడతాయి.. పాతికేళ్ల వయసు వస్తే ఎంతో కొంత బుద్ధి జ్ఞానం వస్తాయి. పాతికేళ్ల లోపు పిల్లలకు అసలు బుద్ధి కూడా ఉండదు.. ఒకపక్క కెమికల్స్ మోసం చేస్తాయి. అలాంటి సమయంలోనే ఏదొక లవ్ స్టోరీ రిలీజ్ అవుతుంది.. వెంటనే తాళి కట్టేస్తారు. ఇలాగె ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇది జోక్ కాదు.. నిజం.. దయచేసి తప్పులు చేయొద్దు అని చెప్పుకొచ్చాడు